పెళ్ళి రిసెప్షన్లో దర్శకుడితో సమంతా డాన్స్ : చై, రానా కబుర్లు

రిసెప్షన్ సందర్బంగా జరిగిన చిన్నపాటి డ్యాన్స్ మెడ్లేలో సమంత డ్యాన్స్ చేసింది. పెళ్లికూతురు డ్యాన్స్ చేయడం పెద్ద విషయమేమీ కాదు కానీ.. ఆమె ఓ దర్శకుడితో కలిసి స్టెప్ వేసి అలరించడం విశేషం.

Recommended Video

Samantha Looked Pretty Dancing With Filmmaker పెళ్ళి రిసెప్షన్లో సమంత డాన్స్

ఈ మధ్యకాలం లో సమంతా నాగ చైతన్య పెళ్ళి అయినంత టాప్ న్యూస్ ఇంకోటిలేదేమో. అక్టోబర్ ఆరో తేదీ నుంచీ ఈ ఇద్దరి పెళ్ళివార్త సినిమా న్యూస్ వెబ్సైట్లకీ, న్యూస్ చానెళ్ళకి కావాల్సినంత "స్టఫ్" ఇచ్చింది. వీలైనన్ని వార్తలూ, విషేషాలతో సమంతా, చైతన్యా అన్ని సమాచార మాధ్యమాల్లోనూ హల్ చల్ చేసారు. ఇక ఈ ఇద్దరూ హనీమూన్ కోసం లండన్ వెళ్ళటం తో ఈ సందడి కాస్త తగ్గింది. అయితే ఈ ఇద్దరి పెళ్ళి తర్వాత రిసెప్షన్ లో వీళ్ళిద్దరూ ఎంత ఆనందంగా ఎంజాయ్ చేసారో తెలిపే ఫొటోఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.

లక్ష్మీ దగ్గుబాటి

లక్ష్మీ దగ్గుబాటి

పెళ్ళి తర్వాత చైతన్య తల్లి లక్ష్మీ దగ్గుబాటి చెన్నై లోని ఒక స్టార్ హొటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు. సమంత పుట్టిల్లు అయిన చెన్నైలోని ఓ ప్రైవేటు హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మీడియాని పెద్దగా అనుమతించలేదు. అయితే ఎంతైనా దగ్గుబాటి వారింటి ఆడపడుచు కాబట్టి ఈ ఫంక్షన్ ని కూడా అదే స్థాయిలో ఎంత గ్రాండ్ గా నిర్వహించారో ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటోలను చూస్తే అర్ధమవుతోంది.

 ఫ్యామిలీ ఫ్రెండ్

ఫ్యామిలీ ఫ్రెండ్

రిసెప్షన్ సందర్బంగా జరిగిన చిన్నపాటి డ్యాన్స్ మెడ్లేలో సమంత డ్యాన్స్ చేసింది. పెళ్లికూతురు డ్యాన్స్ చేయడం పెద్ద విషయమేమీ కాదు కానీ.. ఆమె ఓ దర్శకుడితో కలిసి స్టెప్ వేసి అలరించడం విశేషం. తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను సమంత స్వయంగా షేర్ చేసింది.

కృష్ణ మారిముత్తు

కృష్ణ మారిముత్తు

ఈ ఫోటోలో దర్శకుడు కృష్ణ మారిముత్తు.. సామ్ తో ఓ స్టెప్ వేస్తూ కనిపిస్తాడు. ఇతను అటు చైతన్యకు.. ఇటు సమంతకు మంచి ఫ్రెండ్. ఇతని దర్శకత్వంలోనే రీసెంట్ గా యుద్ధం శరణం మూవీ చేశాడు చైతు. ఆ మూవీ కోసం సమంత కూడా వీలైనంతగా ప్రచారం చేసి పెట్టింది కానీ.. మూవీ డిజప్పాయింట్ చేసింది.

యుద్దం శరణం

యుద్దం శరణం

ఒకవేళ మూవీ గనక సక్సెస్ అయి ఉంటే చైతూ పెళ్ళికానుకగా మరింత హ్యాపీగా ఉండేది. అదే సమయం లో సమంతా చేసిన రాజుగారి గది కూడా మరీ చెప్పుకోదగ్గ హిట్ ఏమీ కాకపోయినా యుద్దం శరణం కంటే బాగానే ఆడింది. అయితే.. ఒక సినిమా సక్సెస్.. ఫెయిల్యూర్ లాంటివి ఫ్రెండ్ షిప్ కి అడ్డు పడే అవకాశం లేదు కాబట్టి మారిముత్తు ఇలా స్నేహితుల పార్టీలో సంతోషంగానే కనిపించాడు. ఇదే ఫోటోలో వెనక చైతు.. రానా సరదాగా కబుర్లు చెప్పుకుంటూకనిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X