మళ్లీ జంటగా చైతూ, సమంత.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్‌లో..
నవ దంపతులైన నాగచైతన్య, సమంత అక్కినేని కలిసి నటించి చాలా కాలమైంది. వారిద్దరూ కలిసి నటిస్తే చూద్దామని అభిమానులు ఆశపడుతున్నారు. తాజాగా షూటింగ్‌లో బిజీగా కనిపిస్తున్న నాగ్, శామ్‌ను చూసి ఒకే సినిమాలో నటిస్తున్నారనుకొంటే పప్పులో కాలేసినట్టే. ఇంతకీ ఈ షూటింగ్ ఏమింటంటే..

వ్యాపార ప్రకటనల రంగంలోకి
అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటివరకు కేవలం సినిమా నిర్మాణాలకే పరిమితమైంది. ప్రస్తుతం వ్యాపార ప్రకటనల రంగంలోకి అడుగుపెడుతున్నది. తొలి ప్రయత్నంగా బిగ్‌బజార్ కోసం యాడ్‌ను రూపొందిస్తున్నారు.

యాడ్‌లో చైతూ, సమంత
బిగ్‌బజార్ కోసం రూపొందించే యాడ్‌లో నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్నారు. ఈ యాడ్‌కు పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో
యాడ్ చిత్రీకరణలో భాగంగా నాగచైతన్య, సమంతకు సీన్ వివరిస్తున్న తరుణ్ భాస్కర్. ఈ షూటింగ్ కోసం సెట్ వేశారా? లేక బిగ్ బజార్‌ను ఎంచుకొన్నారా అనే విషయంపై క్లారిటీ లేదు.

షూట్ మూడ్‌లో తరుణ్, నాగచౌతన్య
షూటింగ్‌ల భాగంగా షూట్ చేసిన సన్నివేశాలను నాగచైతన్య , తరుణ్ భాస్కర్ చూస్తున్నారు. ఈ యాడ్ మధ్యతరగతి ప్రజలకు ఏ రేంజ్‌లో చేరువవుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











