ఆ టాటూ అర్థం ఇదేనట, నాగచైతన్య చెప్పేసాడు... ఇద్దరి చేతిమీదా ఒకటే

ఈ మధ్య కాలం లో హాటెస్ట్ టాపిక్ ఏమిటీ అంటే సమంతా నాగ చైతన్యల ప్రేమ కథే. సమంత నాగ చైతన్య చాలా ఏళ్లుగా ఇద్దరూ గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపించారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇంట్లో వాళ్లని ఒప్పించిన తర్వాతగానీ... విషయం మీడియా వరకు రాలేదు. అది కూడా సమంత ఓ ఇంటర్వ్యూలో అనుకోకుండా నోరు జారడంతో విషయం అందరికీ తెలిసి పోయింది.

తర్వాత నుండి చైతు, సమంత కాస్త ఫ్రీ అయ్యారనే చెప్పాలి. అంతకు ముందు వరకు ఎవరికీ తెలియకుండా చాటు మాటు వ్యవహారాలు నడిపించడం మానేసి కొన్ని రోజులుగా ఓపెన్ గానే కలిసి తిరగడం, డేట్ కు వెళ్లడం లాంటివి చేస్తున్నారు. వచ్చే ఏడాది తమ పెళ్ళి ఉంటుందని, ఇంకా డేట్ ఏదీ ఫిక్స్ చేసుకోలేదని చెప్పిన నాగ చైతన్య సమంతా సినిమాల గురించి కూడా తన అభిప్రాయం చెప్పేసాడు.

Samantha And Naga Chaitanya Tattoo Secrets Revealed

"నేనైనా రెండు కుటుంబాల సపోర్ట్‌తో హీరోగా ఈ స్థాయికొచ్చా. సమంత తన సొంత కష్టంతో ఈ స్థాయికి వచ్చింది. అలాంటి వ్యక్తిని పెళ్ళి కాగానే సినిమాలు ఆపేయమని ఎవ్వరూ అనరనే అనుకుంటా. స్వతహాగా నాకైతే పెళ్ళి తర్వాత తను సినిమాలు మానేయాలన్న ఆలోచన అస్సలు లేదు." అని స్పష్టం చేశారు.

సమంత, నాగ చైతన్యలు ఇద్దరి చేతికి ఒకే సింబల్ తో టాటూ కనిపించగా ఈ విషయం అప్పట్లోనే హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రేమ జంట తమ మణికట్టుపైన "ప్లే నెక్స్ట్" సింబల్ ని తమ ప్రేమకు గుర్తుగా వేయించుకోగా.. ఈ టాటూ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలియక చాలా మందే కన్ఫ్యూజ్ అయ్యారట.

Samantha And Naga Chaitanya Tattoo Secrets Revealed

మామూలుగా సెలబ్రిటీల వొంటిమీద టాటూ కనిపిస్తేనే ఆసక్తిగా చూసే జనం ఇక ఇద్దరి చేతిమీదా ఒకటే సింబల్ కనిపిస్తే మరింత పిచ్చెక్కిపోతారుకదా. ఈ విషయంపై చైతూ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తమ చేతిపై ఉన్న టాటూ రోమన్ సింబల్స్ లో ఒకటి కాగా దీని అర్థం మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకోవాలి అని అంటూ సెలవిచ్చాడు. ఇద్దరి ఆలోచనలు, మనసులు దగ్గర కావడంతో ఈ టాటూ వేయించుకున్నట్టు వివరించాడు చైతూ. మరి వచ్చే ఏడాది పెళ్ళి చేసుకోబోతున్న ఈ యువ జంట ముందు ముందు ఇంకెన్ని షాకులిస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X