»   » దాగుడు మూతల్లేవ్, ఇక ఎంగేజ్మెంటే: మమాగోటో వద్ద చైతూ-సమంత!

దాగుడు మూతల్లేవ్, ఇక ఎంగేజ్మెంటే: మమాగోటో వద్ద చైతూ-సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సమంత, నాగ చైతన్య మధ్య ప్రేమాయణం మొదలై చాలా కాలమే అయినా...ఎవరూ గుర్తించలేక పోయారు. ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటిస్తుండటం, చైతూ కూడా చాలా ఇన్నోసెంట్ బాయ్ కావడంతో వీరిద్దరూ గతంలో కలిసినా ఎవరికీ అనుమానం రాలేదు.

  అయితే ఆ మధ్య సమంత ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయం బయట పెట్టడంతో విషయం లీకైంది. త్వరలో పెళ్లి చేసుకుని సెటిలవుతున్నట్లు వెల్లడించడం...త్వరలోనే తాను పెళ్లాడబోయే వ్యక్తి ఎవరో చెబుతానని సమంత చెప్పిన మరుక్షణమే సమంత లవర్ ఎవరనే విషయమై అన్వేషన్ ప్రారంభం అయింది. సమంత పెళ్లాడబోయేది నాగ చైతన్యనే అనే విషయం బయటకు పొక్కింది.

  మీడియాలో సమంత-నాగ చైతన్య ప్రేమ విషయం, త్వరలో పెళ్లి చేసుకుంటున్న విషయమై బాహాటంగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఇద్దరూ ఖండించక పోవడంతో పాటు నాగార్జున కూడా సంతోషం వ్యక్తం చేయడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.

  దాదాపు రెండు మౌడేళ్లుగా సమంత, నాగ చైతన్య మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోంది. ఇంతకాలం ఈ జంట ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం, ప్రేమ కబుర్లు చెప్పుకోవడం లాంటివి చేసారు. అయితే విషయం పబ్లిక్ కావడంతో....ఈ జంట కూడా దాగుడుమూతలకు తెరదించారు. ఎలాగూ అందరికీ తెలిసిపోయింది కాబట్టి హైదరాబాద్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

  ఇటీవల జీవికె మాల్ వద్ద గల హార్డ్ రాక్ కేఫ్ వద్ద చైతూ, సమంత చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించారు. తాజాగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మమాగోటో రెస్టారెంట్‌లో లంచ్ కంప్లీట్ చైసుకొని బయటకు వస్తుంటే ఎవరో వీరిని తమ కెమెరాలో బంధించారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌లా పాకింది.

  మమాగోటో

  మమాగోటో

  బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని మమాగోటో రెస్టారెంట్‌లో లంచ్ కంప్లీట్ చైసుకొని బయటకు వస్తున్న చైతు, సమంత

  హార్డ్ రాక్ కేఫ్

  హార్డ్ రాక్ కేఫ్

  ఇటీవల జివికె మాల్ వద్ద గల హార్డ్ రాక్ కేఫ్ వద్ద చైతు, సమంత

  ఎంగేజ్మెంట్

  ఎంగేజ్మెంట్

  మరికొన్ని రోజుల్లో నాగ చైతన్య-సమంత ఎంగేజ్మెంట్ జరుగబోతోందని తెలుస్తోంది. అందుకే ఇద్దరూ కలిసి షాపింగులు, లంచ్ డేటింగులు గట్రా చేస్తున్నారు.

  డిసెంబర్లో పెళ్లి

  డిసెంబర్లో పెళ్లి

  డిసెంబర్లో ఇద్దరూ వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

  English summary
  The t-town's most happening love birds, Samantha and Naga Chaitanya spotted at a restaurant in Hyderabad. Looks like the couple had also caught with some shopping before their lunch date. Only a few days ago, the couple were seen having a fun time near Hard Rock Cafe, Hyderabad. Clearly, Sam and Chay doesn't want to hide their closeness from the media eye anymore, as it has already become obvious that their marriage is on cards.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more