»   » పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్)

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ రంగంలోకి అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో హీరోయిన్ సమంత ఒకరు. ప్రస్తుతం సౌత్ లో ఆమె బిజీ హీరోయిన్. 'ఏ మాయ చేశావె' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకుంది.

హీరోయిన్ సమంత త్వరలో నాగ చైతన్యను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమంతలో అందం, ఆటిట్యూడ్ లో ఏదో తెలియని కొత్తదనం కనిపిస్తోంది. తాజాగా విడుదలైన సమంత న్యూ ఫోటోస్.... చూసిన అభిమానులు ఇదంతా పెళ్లి కళ ఎఫెక్టే అని, సమంత ఫేసులో ఎప్పుడూ చూడని గ్లో, ఏదో తెలియని కొత్తదనం ఉట్టిపడుతోందని అంటున్నారు.

స్లైడ్ షోలో సమంతకు సంబంధించిన న్యూ హాట్ ఫోటోస్, సమంతకు సంబంధించిన వివరాలు...

సమంత

సమంత

సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. అందు వల్ల ఆమె తమిళం చాలా బాగా మాట్లాడగలదు. తన కుటుంబ నేపథ్యం తమిళనాడు కాక పోయినా...అక్కడే పుట్టి పెరగడం వల్ల తనను తాను తమిళియన్ గానే చెప్పుకుంటుంది సమంత.

సినిమాల్లోకి...

సినిమాల్లోకి...

'ఏ మాయ చేశావె' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తొలి చిత్రంతోనే అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి హిట్ కావడంతో సమంత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస అవకాశాలు, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

నాగ చైతన్యతో పరిచయం

నాగ చైతన్యతో పరిచయం

తొలి సినిమా ఏమాయచేసావే మూవీలో తనతో కలిసి నటించిన నాగ చైతన్యతో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీని తర్వాత ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది.

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు

దాదాపు 8 ఏళ్ల పాటు స్నేహితులుగా, ప్రేమికులుగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఇన్నాళ్లు తమ రిలేషన్ షిప్ ను రహస్యంగానే ఉంచారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత విషయం బయటకు లీక్ చేసారు. ఆ తర్వాత ఇద్దరూ అఫీషియల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

పెళ్లయిన తర్వాత కూడా

పెళ్లయిన తర్వాత కూడా

పెళ్లయిన తర్వాత కూడా సమంత సినిమాల్లో కొనసాగుతుంది. ఈ విషయాన్ని నాగ చైతన్య స్పష్టం చేసారు. పెళ్లి తర్వాత కూడా తనకు ఇష్టమున్నంతకాలం సమంత సినిమాలు చేస్తుందని, తనకెలాంటి అభ్యంతరం లేదని చైతు అన్నారు. సినిమాల్లో కొనసాగుతుందట

చైతూ, వర్క, మస్కతీ

చైతూ, వర్క, మస్కతీ

సమంత కూడా ఇటీవల ట్విట్టర్ ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు....... నాగ చైతన్య, వర్క్(సినిమాలు), మస్కతీ ఐష్ క్రీం లేకుండా తాను బ్రతకలేనని సమాధానం ఇచ్చింది. దీన్ని బట్టి పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతుందని స్పష్టమవుతోంది.

అక్కినేని ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్

అక్కినేని ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్

నాగ చైతన్య, సమంత ప్రేమ వివాహానికి నాగార్జున-అమల దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఓ వేడుకలో నాగార్జున సమంతను కోడలిగా తన ఫ్రెండ్స్ కు పరిచయం చేసారు.

వచ్చే ఏడాది వివాహం

వచ్చే ఏడాది వివాహం

2017లో నాగ చైతన్య, సమంత వివాహం జరుగబోతోంది. అయితే ఇంకా ముహూర్తాలు ఖరారు కాలేదు.

పెళ్లి సింపుల్ గానే

పెళ్లి సింపుల్ గానే

తమ వివాహాన్ని సింపుల్ గానే జరుపుకుంటామని, భారీ అడంబరాలకు పోయే ఆలోచన లేదని నాగ చైతన్య స్పష్టం చేసారు. నాగ చైతన్య హిందూ కావడం, సమంత క్రిస్టియన్ కావడంతో ఇద్దరి సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగే అవకాశం ఉంది.

సెక్సీ సమంత చిన్నతనంలో ఇలా ఉండేది.. (క్యూట్ ఫోటోలు)

సెక్సీ సమంత చిన్నతనంలో ఇలా ఉండేది.. (క్యూట్ ఫోటోలు)

సమంత 1987, ఏప్రిల్ 28న జన్మించింది. తల్లి మళయాలి, తండ్రి తెలుగు. చిన్నప్పటి నుంచి చెన్నయ్ లోనే పెరిగింది. సమంత చిన్నాటి ఫోటోల కోసం క్లిక్ చేయండి.

    English summary
    Samantha new photo shoot 2016. Samantha Ruth Prabhu is an Indian actress and model. She has established a career in the Telugu and Tamil film industries, and is a recipient of three Filmfare Awards.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu