సమంత హెల్ప్, రంగంలోకి కోన వెంకట్ చెల్లి!
హైదరాబాద్ : ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకున్నారు కోన వెంకట్. ఈ తరానికి తగిన విధంగా ఆయన కథ, స్క్రీప్లే అందించిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. తాజాగా సినీ రంగంలోకి కోన ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆమె ఎవరో కోన వెంకట్ సోదరి కోన నీరజ.
సెలబ్రిటీ స్టైలిస్ట్ మంచి నైపుణ్యం ఉన్న నీరజ.....స్టార్ హీరోయిన్ సమంతకు స్టైలిస్ట్‌గా అపాయింట్ అయింది. ఈ మేరకు సమంతతో పాటు, కోన వెంకట్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సినీ రంగంలో సమంత లాంటి హీరోయిన్లు అందాల సుందరిగా హవా కొనసాగించాలంటే స్టైలిస్ట్‌ల సూచనలు, సలహాలు ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు.
కాగా...తన చెల్లిని సినీ రంగానికి సమంత ద్వారా పరిచయం చేయడంపై కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా ఆనందం వ్యక్తం చేసారు. సినీ రంగంలో ఆమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని ఆకాంక్షించారు. కోన వెంకట్ చొరవతోనే సమంత స్టైలిస్ట్‌గా నీరజ అవకాశం దక్కించుకున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రస్తుతం సమంత నటిస్తున్న సినిమాల విషయానికొస్తే....ప్రస్తుతం ఆమె అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, రభస, మనం, వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందబోయే మూవీతో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో చేస్తోంది. ఇటీవల విడుదలైన సంథింగ్ సంథింగ్ చిత్రంలో సమంత అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












