న్యూ ఇయిర్ నైట్ సమంత ఎక్కడంటే
న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ ని సినిమావాళ్లు చాలా గ్రాండ్ గా జరుపుకుంటూంటారు. బాలీవుడ్ లో అయితే న్యూ ఇయిర్ వస్తోందంటే హీరోయిన్స్ కు పండగ లాంటింది. ఆ రాత్రి కాస్సేపు డాన్స్ చేసి కోట్లు వెనకేసుకోవచ్చు. అయితే మన తెలుగు హీరోయిన్స్ కి అంత సీన్ లేదు. ఇక యూత్ కు ఆరాధ్య దేవతగా మారిన సమంత విషయానికి వస్తే ఆమె ఈ న్యూ ఇయిర్ నైట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఎక్కడ అంటే సిడ్నీలో. న్యూ ఇయిర్ పార్టీలకు ప్రపంచవ్యాప్తంగా సిడ్నీకి మంచి పేరు. అలాంటి చోట ఆమె తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసింది. ఇక త్రిష అయితే గోవాలో తన ప్యామిలీతో కలిసి పార్టీ చేసుకింది. ఆమెతో పాటే శ్రియ, శ్రుతి హాసన్ కూడా గోవాలోనే గడిపారు. అల్లు అర్జున్ కూడా తన భార్యతో గోవా యాత్ర చేసి వచ్చారు.
ఇక మరో హీరోయిన్ లక్ష్మీ రాయ్ మాత్రం లండన్ లో జరుపుకుంది. అనూష్క మాత్రం షూటింగ్ హడావిడిలో ఉండిపోయింది. హీరోల్లో మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇంటివద్దనే జరుపుకున్నారు. ప్రభాస్ బ్యాంకాక్ లో న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ ని ఓ రేంజిలో జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం,మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ, సిద్దార్ద సరసన నందినీరెడ్డి రూపొందించే చిత్రంలోనూ కమిటైంది.


Click it and Unblock the Notifications











