»   » సమంత ఇపుడు మిలియన్ డాలర్ హీరోయిన్...

సమంత ఇపుడు మిలియన్ డాలర్ హీరోయిన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంతను అంతా ఇపుడు మిలియన్ డాలర్ హీరోయిన్ అంటున్నారు. అందుకు కారణం ఆమె ఇటీవల విడుదలైన ‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడమే. ఈ చిత్రం యూఎస్‌లో మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా నిలించింది.

ఇప్పటి వరకు యూఎస్ఏలో విడుదలైన తెలుగు చిత్రాల్లో 12 చిత్రాలు మాత్రమే.... మిలియన్ డాలర్ వసూళ్లు సాధించాయి. అందులో ఆరు సినిమాలు సమంత నటించినవే కావడం విశేషం. ఆమె నటించిన దూకుడు, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఈగ, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు ఇప్పటి వరకు ఇక్కడ మిలియన్ డాలర్ వసూలు చేసాయి.

Samantha now million dollar beauty

సమంతకు సంబంధించిన ఇతర విషయాల్లోకి వెళితే...ఆమె తెలుగు,తమిళ భాషల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ‘10 ఎందుకుల్లా', సూర్య నటిస్తున్న 24, వేల్ రాజ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు ఎన్టీఆర్ హీరోగా తెలుగులో రీమేక్ అయ్యే కత్తి ఓ సినిమాలోనూ నటించనుందని సమాచారం.

కాగా..సమంత బాలీవుడ్ కి వెళ్లాలని ఆమె అబిమానులు కోరుకుంటున్నారు. దక్షిణాదిన కొన్ని విజయాలు చేతికి అందగానే ఇక అందరి దృష్టి బాలీవుడ్‌పై పడుతుంది. అక్కడ కూడా నిరూపించుకోవాలన్న తపన మొదలవుతుంది. అయితే సమంతకు అలాంటి ఆలోచనలేం లేదని స్పష్టం చేస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...''నా దగ్గర కూడా కోరికల జాబితా చాలానే ఉంది. మంచి సినిమాలు చేయాలి, మరింత పేరు తెచ్చుకోవాలని ఉంది. అయితే ఈ జాబితాలో హిందీ సినిమా చేయాలన్న కోరిక లేదు..'' అంటోంది సమంత.

    English summary
    Samantha starrer Manam, Dookudu, Atharintiki Dharedi, Seethamma Vaakitlo Sirimalle Chettu, Eega, ‘S/O Satyamurthy’ crossed the $1 Million milestone in USA box office.
    Please Wait while comments are loading...
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu