గురుదక్షిణ సమర్పిస్తున్న హాట్ హీరోయిన్ సమంత

By Srikanya

ఏ మాయ చేసావె చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత తనను అలా ప్రొజెక్టు చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్ కి గురు దక్షిణ చెల్లించాలనుకుంటోంది. అందుకోసమే ఆమె ఎర్ర గులాబీలు చిత్రంలో గెస్ట్ గా చేసింది. అలాగే ఆ చిత్రంలో సమీరా రెడ్డి,సమంత హీరోయిన్స్ గా చేసారన్నా సైలెంట్ గా ఉంటోంది. ఇక ఎర్రగులాబీలు చిత్రం జనవరి 28న విడుదల అవుతోంది.

ఈ సందర్బంగా దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ...ఇది ఓ సైక్లాజికల్ ధ్రిల్లర్. సినిమా మొత్తం ఒక రాత్రిలో జరుగుతుంది. అందుకే షూటింగ్ రాత్రి పూటే తీసాము. టెక్నికల్ గా బాగా కష్టపడి చేసాము అన్నారు. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రం అన్నారు. అశోక్ వల్లభనేని నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ లో పాటలుండవు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం రూపొందుతున్నా తెలుగుకు మాత్రమే ఈ 'ఎర్ర గులాబీలు" టైటిల్ ‌ని ఉపయోగిస్తున్నారు. మనోజ్ పరమహంస దీనికి కెమెరా వర్క్‌ ని అందిస్తున్నారు. బాలచందర్ దర్శకత్వంలో 70వ దశకంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో 'ఎర్రగులాబీలు" ఒకటి. ఈ థ్రిల్లర్ చిత్రంలో కమల్ ‌హాసన్, శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషించిన విషయం విదితమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X