»   » పవన్ కళ్యాణ్‌తో సమంతకు మరో ఛాన్స్!

పవన్ కళ్యాణ్‌తో సమంతకు మరో ఛాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించి అందరినీ మెప్పించిన హీరోయిన్ సమంతకు క్రిటిక్స్‌తో పాటు, ప్రేక్షకుల నుంచి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇందులో సమంత గత చిత్రాలకు భిన్నంగా బబ్లీగా, అల్లరి పిల్ల 'శశి' పాత్రలో ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్-సమంత బావమరదళ్లుగా నటించారు. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా మరదలిని బావ ఆట పట్టించడం, బావతో మరదలు సరసాలు వగైరా సీన్లు, పాటలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తర్వాత సినిమా 'గబ్బర్ సింగ్-2'లో కూడా సమంతకు చాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. పవన్ కూడా మరోసారి ఆమెతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపుతూ....సమంతను రికమండ్ చేస్తున్నాడట. 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి ఇప్పటికే పలువురు హీరోయిన్లను అనుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఖరారు కాలేదు.

గతంలో సమంత మహేష్ బాబుతో 'దూకుడు' చిత్రంలో నటించి రెండో సారి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో అవకాశం దక్కించుకుంది. జూ ఎన్టీఆర్‌తో 'బృందావనం' చిత్రంలో నటించి రెండో సారి 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ఎంపికయింది. ఇపుడు పవన్ కళ్యాణ్‌తోనూ....ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

English summary
Samantha would bag atleast two movie offers of the Tollywood star heroes, she would soon act with Pawan Kalyan in one more time in 'Gabbar Singh 2'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu