»   » ‘మహానటి’ కోసం సమంత సొంత డబ్బింగ్

‘మహానటి’ కోసం సమంత సొంత డబ్బింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత 8 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ కొనసాగిస్తున్న హీరోయిన్ సమంత ఇప్పటి వరకు సొంతగా డబ్బింగ్ చెప్పుకోలేదు. ఆమె పాత్రలకు సింగర్ చిన్మయి శ్రీపాద గాత్రదానం చేస్తూ వస్తున్నారు. చిన్మయి వాయిస్ అద్భుతంగా ఉండటం, సమంతకు పర్ఫెక్టుగా సూటవ్వడంతో దాన్నే కొనసాగిస్తూ వస్తున్నారు. సమంత కూడా సొంతగా డబ్బింగ్ చెప్పడంపై ఫోకస్ పెట్టలేదు.

అయితే 'మహానటి' సినిమా కోసం తొలిసారిగా సమంత తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో మీ పాత్రకు మీరే డబ్బింగ్ చెబితే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని చెప్పి సమంతను ఒప్పించాడట.

Samantha Own Dubbing For Mahanati

సమంత ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్‌తో 'మహానటి' చిత్రం మొదలవుతుందని టాక్. ఆమె తన జర్నల్ గురించి చెప్పే క్రమంలోనే సినిమా రన్ అవుతుందని అంటున్నారు.

వై జయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్, టీజర్ విడుదల కానుంది.

English summary
Film Nagar repotrs said that, Samantha is dubbing for herself in Mahanati, biopic on legendary actress Savitri. Since director Nag Ashwin requested Sam to lend her voice for her role in his latest directorial as to bring realness, the actress has readily accepted his proposal. In fact, all the other artists working for the film are dubbing their own voice.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X