నితిన్ సరసన సమంత ఖరారు

By Srikanya

హైదరాబాద్ : సమంతని తెలుగు ఇండస్ట్రీ లక్కీ గాళ్ గా పరిగణిస్తున్నారు. ఆమె ఏ సినిమా లో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆమె వెనక పడుతున్నారు. తాజాగా ఆమె మరో చిత్రం కమిటైంది. నితిన్ సరసన ఆమె తొలిసారిగా నటించనుంది. గతంలో 'ఆటాడిస్తా' చిత్రాన్ని తెరకెక్కించిన ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో సమంత హీరోయిన్‌గా ఖరారు అయినట్లు సమాచారం.

'ఇష్క్', 'గుండె జారి గల్లంతయ్యిందే' చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో యంగ్ హీరో నితిన్ దశ తిరిగింది. ఇప్పుడు వరుస అవకాశాలు నితిన్‌ను ముంచెత్తుతున్నాయి. ఆ రెండు చిత్రాల హిట్ అయ్యాక పలు ఆఫర్లు దక్కించుకున్న నితిన్‌కు తాజాగా మరో చాన్స్ దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారట.

ప్రస్తుతం నితిన్ 'కొరియర్ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నటిస్తున్నారు. ప్రభుదేవా శిష్యుడు ప్రేమ సాయి ఈ సినిమాకు దర్శకుడు. గౌతం మీనన్ నిర్మాత. నితిన్ సరసన యామి గౌతం నటిస్తుంది. కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. తమిళ, తెలుగు సినిమాలలో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'హార్ట్ ఎటాక్' అనే చిత్రం చేస్తున్నారు.

గతంలో వైష్ణో అకాడమీ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని తను ప్రారంభించిన కొత్త బ్యానర్ పూరీ జగన్నాథ్ టాకీస్ పై స్వీయ దర్శకత్వంలో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటిసారి వీరి కలయికలో తెరకెక్కే ఈ చిత్రం మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మరో ప్రక్క కరుణాకరన్ చిత్రం సైతం జనవరి 2014 లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X