రొమాంటిక్ హీరోతో కమిటయిన సమంత
'ఏ మాయ చేసావె' తో పరిచయమై ఓవర్ నైట్ లో స్టార్ అయిన సమంత తాజాగా రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న సిద్దార్ధ ప్రక్కన చేయటానికి కమిటయ్యింది. వేణు శ్రీరామ్ అనే కొత్త దర్శకుణ్ని పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీగా రూపొందనుందని తెలుస్తోంది. చిత్రం కథ మఖ్యంగా స్నేహం, ప్రేమ, చుట్టూ తిరుగుతూంటుందని వినపడుతోంది. అలాగే ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక సమంత దిల్ రాజు ప్రస్తుతం నిర్మిస్తున్న 'బృందావనం'లో ఎన్టీఆర్ సరసన చేస్తోంది. అనంతరం మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందే పవర్ చిత్రంలో చేయనుంది. అలాగే సిద్దార్ధ ప్రస్తుతం రాఘవేంద్రరావు కుమారుడు కె.ప్రకాశరావు దర్శకత్వంలో రెడీ అవుతున్న ఫాంటసీ చిత్రంలోనూ, రాంబాబు అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ నిర్మితమవుతున్న 'బావ' చిత్రంలోనూ చేస్తున్నాడు. ఇంతకుముందు సిద్దార్ధతో దిల్ రాజు బొమ్మరిల్లు వంటి సూపర్ హిట్ ఇచ్చి ఉండటంతో మరో సారి ఈ కాంబినేషన్ పై క్రేజ్ ఏర్పుడుతోంది.


Click it and Unblock the Notifications











