షాక్... సమంత ఏంటి ఇలా అనేసింది?
హైదరాబాద్ : సమంత చాలా జోవియల్ గా ఉంటుందని ఆమెతో పనిచేసినవారు గానీ, ఆమె ట్విట్టర్ అప్ డేట్స్ డైలీ ఫాలో అవుతున్నవారు కానీ చెప్తూంటారు. అయితే జోవియల్ గానే కాదు నాటిగానూ ఆమె మాట్లాడగలదని ఆమె ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ చెప్తున్నాయి. ఆమె రీసెంట్ గా చేసిన రీ ట్వీట్ లో ఆమె..బ్రహ్మాజికి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో చర్చగా మారింది.
రభస చివరి రోజు సందర్బంగా.. సమంత తాను రభస చివరి రోజు గురించి హైదరాబాద్ లోనే ఉన్నాను అని ట్వీట్ చేసింది. దానికి క్రింద బ్రహ్మాజీ...తాను యూనిట్ ని చాలా మిస్ అవుతున్నానని, ధాయ్ లాండ్ లో ఉండటం వల్ల తాను రాలేకపోయాను అని చెప్పుకొచ్చారు. అయితే వెంటనే సమంత ఇది చదివి... "ఆ...ఏం చేస్తున్నావ్ అక్కడ...షూటింగా...ప్లెజరా " అంది. ప్లెజర్ అన్నమాట ఆమె నోటి వెంట విన్నవారు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె సరదాగా బ్రహ్మాజీని ఆటపట్టించటానికే అన్నా సమంత భలే స్పీడు అంటూ ఈ ట్వీట్ గురించే మాట్లాడుకున్నారు.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రభస. సంతోష్‌శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో ఆయన తనయుడు గణేష్‌బాబు నిర్మిస్తున్నారు. సమంతా, ప్రణీత కథానాయికలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్టు 1న ఆడియోను విడుదల చేయబోతున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఎన్టీఆర్ పాత్ర చిత్రణ శక్తివంతంగా వుంటుంది. లుక్స్‌పరంగా ఆయన ైస్టెలిష్‌గా కనిపిస్తారు. ఓ ఉదాత్తమైన లక్ష్యసాధన కోసం ఎన్టీఆర్ చేసే రభస ఆయన అభిమానుల్ని ఉర్రూతలూగిస్తుంది అని తెలిపారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి తమన్ చక్కటి సంగీతాన్నందించాడు. ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయి అన్నారు.
బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీషిండే, నాగినీడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్.కె.నాయుడు, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.వెంకటరత్నం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సంతోష్‌శ్రీనివాస్.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











