»   » అవయవదానం చేయడానికి ముందుకొచ్చిన సమంత

అవయవదానం చేయడానికి ముందుకొచ్చిన సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత అతి తక్కువ కాలంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటుంది. అయితే తాను సంపాదించిన డబ్బులో కొంత మొత్తానికి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్ స్థాపించిన సమంత ఈ ఆర్గనైజేషన్ ద్వారా డబ్బులేని కారణంగా ఆపరేషన్ చేయించుకోలేకపోతున్న పేద చిన్నారులకు సాయం చేస్తోంది.

తాజాగా అవయవ దానం కార్యక్రమంలో తాను భాగస్వామి అవ్వాలని నిర్ణయించుకుంది. తాను అవయవ దానం చేయడానికి ముందుకు రావడంతో పాటు తన అభిమానులను కూడా ఆదిశగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. నవంబర్ 7వ తేదీన ప్రత్యూష ఫౌండేషన్ తో పాటు, హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో అవయవదానం విషయంలో ప్రతిజ్ఞ చేయబోతోంది. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించబోతోంది. అవయవ దానం ఉద్యమంగా సాగేలా తన వంతు ప్రయత్నం చేస్తానంటోంది సమంత.

Samantha pledges to donate her organs

అవయవదానం మనిషికి రెండో జీవితం. ఒక వ్యక్తి అవయవదానం ద్వారా ఎంతో మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. ఇవి కేవలం అందమైన నినాదాలు మాత్రమే కాదు. వాస్తవాలు. అంతకన్నా నేటి ఆధునిక యుగంలో జీవన సత్యాలు. ఈ మధ్య అవయవదానం గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అంతకన్నా ఎక్కువగా దాని ప్రాముఖ్యాన్ని గురించి చర్చ జరుగుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి, దానిలో భాగంగా పెరిగిన వైద్యశాస్త్ర పరిజ్ఞానం వెలుగులో ఎన్నో అసాధ్యమనుకున్న వాటిని సుసాధ్యం చేసి మనిషికి ప్రాణం నిలుపుతున్నారు, లేదా పోస్తున్నారు. ఈ నేపథ్యంలో అవయవదానం గురించి, దాని ప్రాధాన్యం గురించి సమా జంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరమున్నది.

    English summary
    Samantha will pledge to donate her organs and also invited her fans to take part in an organ donation pledge.
    Please Wait while comments are loading...