ఎలాంటి ఫోటోలు అడిగినా చూపించేస్తోంది.. కొత్త ట్రెండ్‌తో సమంత రచ్చ
ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఉన్నట్టుంది. ఈ మధ్యే విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్‌లో సమంత కాలు పెట్టింది. నయన్, సమంత కలిసి చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ మీద సౌత్ ఆడియన్స్ బాగానే దృష్టి పెట్టారు. అలా సమంత, విజయ్ సేతుపతి షూటింగ్ సెట్‌లో సందడి చేసిన వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. సమంత సినీ విశేషాలు కాసేపు పక్కన పెడదాం. లాక్డౌన్ నుంచి సోషల్ మీడియాలో సమంత చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే.

లాక్డౌన్‌లో అలా.1
సమంత లాక్డౌన్‌లో నేర్చుకున్న కొత్త పనులు అన్నీ ఇన్నీ కావు. అర్బన్ ఫార్మింగ్, స్పెషల్ వంటకాలు, ఆర్గానిక్ ఫుడ్ ఇలా కొత్త కొత్త వంటను నేర్చుకుంది. ఇక హష్‌తో కలిసి డాబా మీద ఉన్న తన సేద్యంలో పనులు చేస్తూ బిజీగా గడిపింది. అంతే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సాకీ ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

డబ్బింగ్ పూర్తి చేసేసింది..
అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వడంతోనే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ డబ్బింగ్‌ను పూర్తి చేసేసింది. ఈ మేరకు డబ్బింగ్ విశేషాలను చెబుతూ సమంత షేర్ చేసిన ఫోటో బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా సమంత ఓ కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టింది.

ఏ ఫోటో అయినా అడగండి..
కొత్త ట్రెండ్ మొదలుపెడదాం.. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం.. అంటూ ఓ ట్రెండ్ మొదలు పెట్టింది. ఏ ఫోటోలు అయినా అడగండి నేను పంపిస్తాను అంటూ నెటిజన్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు తమ క్రియేటివిటీకి పదును పెట్టేశారు.

రకరకలా ఫోటోలు..
తింటున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, నవ్వినప్పుడు, భర్తతో ఉన్నప్పుడు, హష్‌తో దారుణంగా ప్రవర్తిస్తున్నప్పుడు.. మేం ఎవ్వరం చూడని ఫోటో, నీ ఫోన్‌లో లేటెస్ట్‌గా దిగిన ఫోటో, మేకప్ లేని ఫోటో, నాగార్జునతో దిగిన ఫోటో అంటూ ఇలా నెటిజన్లు తమ డిమాండ్ మేరకు అడిగారు. అయితే సమంత నెటిజన్లు కోరిక, డిమాండ్లకు తల వంచింది.

పిక్స్ వైరల్..
ఇందులో సమంత నాగ చైతన్యతో దిగిన లేటెస్ట్ ఫోటో బాగా వైరల్ అవుతోంది. అంతే కాకుండా హష్‌తో దుప్పటి కప్పుకుని దిగిన ఫోటో, మేకప్ లేని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి సమంత ఇలా కొత్త రకం ట్రెండ్‌కు నాంది పలికింది. ఇంకా నయం ఆకతాయిలు సమంతను అడగరాని ఫోటోలను అడగలేదు.


Click it and Unblock the Notifications











