బూతు ఫోటో పోస్టు చేసిన సమంత...అందులో అర్థమేంటి?
హైదరాబాద్: సినిమా తారలు ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే. కొన్ని సార్లు వారి చేష్టలు వివాదాలకు దారి తీస్తాయి. తాజాగా సమంత తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసిన ఓ ఫోటో చర్చనీయాంశం అయింది. హిపోక్రాట్స్ ఇలానే ఉంటారంటూ....మన ప్రాచీన దేవాలయాలపై ఉండే ఓ బూతు బొమ్మను పోస్టు చేసింది.
అయితే దీనిపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ చర్య ద్వారా కాంట్రవర్సీలను ఆహ్వానించే ప్రయత్నం సమంత చేస్తోందని అంటున్నారు. హిపోక్రసీ అంటే ఒకటి చెప్పి, ఇంకొకటి చేయటం. హిపోక్రసీ అంటే వేరు వేరు మనుషులను వేరు వేరు దృష్టులతో చూడటం. ఇలా చేసే వారిని హిపోక్రాట్స్ అంటారు. మరి సమంత ఏ ఉద్దేశ్యంతో ఈ ఫోటో పోస్టు చేసిందో?
సమంత సినిమాల విషయానికొస్తే....ఆమె నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్టయింది. మరో వైపు జూ ఎన్టీఆర్‌కు జోడీగా సమంత నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి.
నాగ చైతన్యకు జోడీగా 'ఆటో నగర్ సూర్య' సినిమాతో పాటు అక్కినేని మల్టీ స్టారర్ చిత్రం 'మనం'లో నటిస్తోంది. దీని తర్వాత ఎన్టీఆర్‌కు జోడీగా 'రభస' చిత్రంలో కూడా చేస్తోంది. అనంతరం వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యే సినిమాకు కూడా కమిట్ అయింది. దీంతో పాటు ఓ హిందీ, మరో తమిళ సినిమాకు సైన్ చేసింది.


Click it and Unblock the Notifications












