త్రిషను మరీ పొగిడేస్తున్న మరో టాప్ హీరోయిన్...!?
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవనే సామెతని మన సినిమా హీరోయిన్లకు ఆపాదిస్తుంటారు విశ్లేషకులు. ఓ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే, అందులో ఎవరి రోల్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉందనే విషయం దగ్గర గొడవ మొదలవుతుంది. ఈ కీచులాట ఎక్కువగా బాలీవుడ్ లో మనకి కనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్సే మనసు లోపల ఉన్నా మన టాలీవుడ్ భామలు బయటపడరు.పైగా సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరినొకరు తెగ పొగిడేస్తుంటారు.
దూకుడుతో టాలీవుడ్ లో హీరోయిన్ సమంతా దూసుకుపోతుంది. వరుస సినిమాలతో బిజీగా మారిపోతుంది. టాలీవుడ్ లో పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంది. మహేష్ దూకుడు బిగ్గెస్ట్ హిట్ అవడంతో ఆ సినిమాలో నటించిన సమంతాకు లక్కీ హ్యాండ్ అన్న పేరు వచ్చేసింది. సమంతా నటించిన ఏ మాయ చేసావే, బృందావనం, దూకుడు వరుసగా హిట్ అవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు వెంట పడుతున్నాయి.
ఇటీవల ఓ సందర్భంలో 'ఇప్పటి హీరోయిన్ లలో తమన్నా అంటే ఇష్టం. తను మంచి హార్డ్ వర్కర్అని కితాబిచ్చింది బెంగళూరు బ్యూటీ అనుష్క. తాజాగా త్రిషపై సమంత ప్రశంసల జల్లు కురిపించింది. 'ఏ మాయ చేసావె' సినిమాకు గాను ఆమధ్య ఫిలింఫేర్ అవార్డు తీసుకున్న సమంత తనకు ఆ అవార్డు రావడానికి కారణం త్రిషేనంటోంది.నేను తెలుగు వెర్షన్ లో అంత బాగా చేశానంటే దాని తమిళ వెర్షన్ 'విన్నైతాండి వరువాయా'లో త్రిష చేసిన అద్భుత నటనే కారణం. నటన విషయంలో నా రోల్ మోడల్ తనే అంటూ చెప్పింది ఈ చెన్నై చిన్నది.


Click it and Unblock the Notifications











