సెక్స్, ఫుడ్... హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్!
మేగజైన్ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తనకు ఫుడ్ కంటే సెక్స్ ముఖ్యమని తెలిపింది.
హీరోయిన్ సమంత ఇటీవల జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా సెక్స్ గురించి ఆమె బోల్డ్‌గా మాట్లాడటం చర్చనీయాంశం అయింది.
ఇంటర్వ్యూలో భాగంగా ఫుడ్, సెక్స్ గురించి ఓ ప్రశ్న వేశారు. సెక్స్, ఫుడ్ వీటిలో దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? అనే ప్రశ్నకు సమంత స్పందిస్తూ... 'ఈ రెండింటిలో ఒక దాన్ని ఎంచుకోవడం కష్టమే. అయితే నా మొదటి ప్రాధాన్యత సెక్స్' అంటూ సమంత సమాధానం ఇచ్చింది.
ఇంటర్వ్యూ వీడియో
ఈ ఇంటర్వ్యూలో సమంత చైతు గురించి కూడా చాలా విషయాలు చెప్పింది. చైతూలో స్థిరత్వం తనకు ఎంతగానో నచ్చిందని, అతడు చాలా రొమాంటిక్ అని సమంత చెప్పుకొచ్చింది. తన కోసం ఖరీదైన డియో బ్యాగ్ కొని, దానిపై స్కెచ్ పెన్నులతో ఎంతో క్యూట్ మెసేజ్ రాశాడని ఆమె గుర్తు చేసుకున్నారు.

తన బ్యాగులో...
తన హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడూ నోట్ బుక్, పెర్ఫ్యూమ్, లిప్ స్టిక్, ఫోన్ ఉంటాయని చెప్పింది. తాను చేయాల్సిన పనులను మర్చిపోకుండా ఉండేందుకు నోట్ బుక్ లో అన్నీ రాసుకుంటుంటానని సమంత చెప్పింది.

ఆల్రెడీ పెళ్లయింది
నాగ చైతన్యతో పెళ్లిపై ఎలా ఫీలవుతున్నారు అని ఇటీవల ట్విట్టర్ చాట్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నపై సమంత స్పందిస్తూ... నా మైండ్‌లో చైతన్యతో ఆల్రెడీ పెళ్లి జరిగి పోయింది. మేము ఇద్దరం తప్ప మిగతావారంతా ఈ విషయంలో ఎక్కువగా ఎగ్టైట్ అవుతున్నారని సమంత అభిప్రాయ పడ్డారు.

చాలా వరస్ట్, అలాంటివి చేయను
మీరు చైతన్య ఫోన్ చెక్ చేస్తారా? అనే ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ.... అలా చేయడం చాలా వరస్ట్ హాబిట్. నేనైతే ఎప్పుడూ అలా చేయను. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న మీకు ఓ దండం అంటూ సమంత రిప్లై ఇచ్చారు.


Click it and Unblock the Notifications











