అక్కినేని వారికి సమంత భారీ డిస్కౌంట్, మర్మమేమిటి?
హైదరాబాద్: సాధారణంగా సినిమా యాక్టర్లు ఎవరైనా రెండు మూడు హిట్ల తర్వాత తమ రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. హీరోయిన్ సమంత కూడా అందుకు అతీతం ఏమీ కాదు. రెండు, మూడు హిట్ల తర్వాత అమ్మడి రెమ్యూనరేషన్ కోటి దాటేసింది.
అయితే ఇపుడు ఉన్నట్టుండి తక్కువ అమౌంట్ చార్జ్ చేస్తూ పరిశ్రమ వర్గాలను ఆశ్చర్య పరుస్తోందట. ఇదే విషయం సమంతను అడిగితే...'నాకు కావాల్సింది డబ్బు కాదు, మంచి పాత్రలు కావాలి' అని సమాధానం ఇస్తోందట.

మంచి పాత్రలు, మంచి సినిమా చేయాల్సిన సమయం వస్తే తక్కువవ రెమ్యూనరేషన్ తీసుకుని కూడా చేయడానికే రెడీ అని అంటోంది. చాలా బాగా, నన్ను పూర్తిస్థాయిలో మెప్పించే స్ర్కిప్టు వస్తే ఫ్రీగా చేయడానికి కూడా వెనకాడను అని స్టేట్మెంట్లు ఇస్తోందట.
గతంలో సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ తో పోలిస్తే అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రానికి చిలా తక్కువ మొత్తం చార్జ్ చేసిందట సమంత. చిన్న సినిమాలు చేయడం నాకు తెలియదు, కానీ అది ఒక మంచి సినిమా అని నాకు అనిపిస్తే అందులో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ సినిమా బడ్జెట్ కు తగిన విధంగా రెమ్యూనరేషన్ తీసుకుంటాను అంటోందట సమంత. మరి 'మనం' చిత్రం చిన్న సినిమా కాక పోయినా? సమంత తక్కువ రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకుంది? అనేది చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











