»   »  సమంత మోసపోయింది: అందుకే చరణ్ మూవీ నుండి ఔట్

సమంత మోసపోయింది: అందుకే చరణ్ మూవీ నుండి ఔట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో డబ్బులు ఎగ్గొట్టడం అనేది సర్వసాధారణమైన విషయం. సినిమా హిట్టయితే కాస్త ఆలస్యమైనా వస్తాయనే నమ్మకం ఉంటుంది. ఒక వేళ ప్లాపయితే మాత్రం హీరో, హీరోయిన్లకు నిర్మాతలు డబ్బుల విషయంలో పంగనామం పెట్టడం ఖాయం. అందుకే చాలా మంది స్టార్స్ ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటారు. నిర్మాత అడ్వాన్సు ఇవ్వడం లేటైనా, కోత పెట్టినా షూటింగులకు డుమ్మా కొట్టిన సందర్భాలూ అనేకం.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

 Samantha Out Rakul in for Ram Charan & Srinu Vaitla Movie

తాజాగా సమంత విషయంలోనూ ఇది రుజువైంది. ఇటీవల రామ్ చరణ్, శ్రీను వైట్ల సినిమాలో సమంత హీరోయిన్‌గా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసింతే. అయితే రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతతో సమంతకు పొసగక పోవడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్తానంలో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నారు.

చరణ్ సినిమా నుండి ఎందుకు తప్పుకున్నారు? అనే విషయం అడిగితే....తనకు జరిగిన గత అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాటలు పరిశీలిస్తే డబ్బు విషయంలో నిర్మాత సరిగా లేక పోవడం వల్లనే తాను సినిమా నుండి తప్పుకున్నట్లు చెప్పకనే చెప్పింది. గతంలో డబ్బు విషయంలో ఆమెను పలువురు నిర్మాతలు మోసం చేయడం వల్లనే రెమ్యూనరేషన్ మ్యాటర్లో ఇంత కఠినంగా ఉందని తెలుస్తోంది.

సినిమా మొదలు పెట్టేప్పుడు నిర్మాత వద్ద డబ్బులుంటాయి. పూర్తయ్యే సమయంలో మాత్రం ఆర్థిక సమస్యలంటారు. ఆవంకతో హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్లో కోత పెట్టడం అలవాటయిపోయింది. అందుకే సినిమా మొదలు పెట్టే సమయంలోనే డబ్బు విషయంలో క్లారిటీ ఇవ్వాలనేది నా అభిప్రాయం. ముందు ఒక మాట..తర్వాత మరొక మాట చెబితే కుదరదు అని తెగేసి చెప్పింది సమంత.

    English summary
    Samantha out Rakul in for Ram Charan & Srinu Vaitla Movie because of remuneration issue.
    Please Wait while comments are loading...