సమంత, రామ్ అవమాన భారంతో...

ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్ ఫంక్షన్ కు ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో స్థానం దక్కించుకుని హాజరయ్యారు రామ్, సమంత. అయితే ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన దియా మీర్జా...నాగార్జున, రామానాయుడు తదితరులను వేదికపైకి సాధరంగా ఆహ్వానించింది. స్టేజిపైకి పిలిచే ఆహ్వానితుల లిస్టులో రామ్, సమంత పేరున్నప్పటికీ వారిని ఆహ్వానించలేదు దియా. దీంతో అవమాన భారంతో అక్కడి నుంచి తిరుగుపయం అయ్యారు ఇద్దరూ. విషయం గమనించిన ఆర్గనైజర్లు ఆ తర్వాత వారిని పిలిచినా వారు అప్పటికే అక్కడి నుంచి వెళ్లి పోయారని సమాచారం.


Click it and Unblock the Notifications











