twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత, రానా సమ్‌థింగ్ సమ్‌థింగ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హాట్ హీరోయిన్ సమంత, యువ హీరో దగ్గుబాటి రానా కలిసి ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారు. అయితే హీరో హీరోయిన్లుగా మాత్రం కాదు. వీరిద్దరు కలిసి గెస్ట్‌రోల్‌లో నటించబోతున్నారు. సిద్దార్థ-హన్సిక జంటగా సుందర్.సి దర్శకత్వంలో 'సమ్‌థింగ్ సమ్‌థింగ్' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

    ఈ చిత్రంలో హీరోయిన్ సమంత, రానా దగ్గుబాటి ముఖ్యమైన అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 14న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది. బ్రహ్మానందం ఈ చిత్రంలో లవ్ గురు గా హైలెట్ కానున్నారు.

    ఇందులో సిద్దార్ద పాత్ర పేరు కుమార్. చిత్రం కథ గురించి దర్శకుడు సుందర్. సి. మాట్లాడుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేయాలన్నది కుమార్‌ ఉద్దేశం. చేసే పనిలో కష్టం ఉన్నా ఫలితం మధురంగా ఉంటుందని అతనికి చెప్పిందెవరు? అతని ఆలోచనల్ని మార్చాలని ప్రయత్నించినవాళ్లకి ఎదురైన అనుభవాలేమిటన్నది తెర మీదే చూడాలన్నారు.

    రానా సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రుద్రమదేవి' చిత్రంలో కథనాయకుడిగా చేస్తున్నాడు. దీంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే 'బాహుబలి' చిత్రంలో కీలకమైన విలన్ రోల్ పాత్రకు ఎంపికయ్యాడు. సమంత ప్రస్తుతం అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, మనం, రభస చిత్రాలకు కమిటైంది.

    English summary
    Samantha and Tollywood hunk Rana Daggubati will be seen in important cameos in Siddharth-Hansika next movie ‘Something Something’. Brahmanandam will be seen in the role of a Love Guru.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X