‘శాకుంతలం’ పనిలో మునిగిన సమంత.. దానిపై ప్రేమ పెంచేసుకుంది!
గుణ శేఖర్ సినిమా తీసే సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కూడా టెక్నికల్ వాల్యూస్, ఆయన టేకింగ్ మాత్రం అందరినీ కట్టి పడేస్తుంటుంది. అందుకే గుణ శేఖర్ సినిమాలంటే ఎప్పటికీ ఓ మోస్తరు అంచనాలు ఉంటాయి. అయితే గుణ శేఖర్ సరైన సక్సెస్ చూసి చాలా యేళ్లు అవుతోంది. చివరగా రుద్రమ దేవీ అంటూ అనుష్కతో ప్రయోగం చేశాడు. అది కమర్షియల్‌గా అంత వర్కవుట్ అవ్వలేదు.

ఫలితాలతో సంబంధం లేకుండా..
గుణ శేఖర్ ఎప్పుడూ కూడా ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. అయితే ప్రతీసారి గుణ శేఖర్ ప్రయత్నం వర్కవుట్ అవ్వదు. ఆయన కెరీర్‌లో ఎన్ని బ్లాక్ బస్టర్లు ఉన్నాయో.. అన్ని డిజాస్టర్లున్నాయి. అలా గుణ శేఖర్ ఇప్పుడు మళ్లీ తన సత్తాను చాటుకునేందుకు ముందుకు వస్తున్నాడు.

మరో ప్రయోగం..
మైథలాజికల్ చిత్రాలంటే ఇప్పుడు కాస్త రిస్క్‌తో కూడుకున్నవి. అయినా కూడా సరే గుణ శేఖర్ మాత్రం ముందడుగు వేసేశాడు. శకుంతల దుష్యంతుల ప్రేమ గాథను వెండితెరపై ఆవిష్కరించేందుకు రెడీ అయ్యాడు. ఈ మేరకు అన్నపూర్ణలో భారీ సెట్‌లు డిజైన్ చేస్తున్నారు.

సమంత కూడా రెడీ..
అయితే శకుంతల పాత్రను పోషించడం అంటే మామూలు విషయం కాదు. ఆ పాత్ర కోసం గుణ శేఖర్ ఎవరినీ ఎంచుకుంటాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అలా చివరకు శకుంతల పాత్రలో సమంత నటించబోతోందని ప్రకటించడంలో ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగాయి.

ఇప్పుడు అలా..
అయితే తాజాగా సమంత ఇప్పుడు శాకుంతలం స్క్రిప్ట్ చదివే పనిలో పడింది. శాకుంతలం స్క్రీన్ ప్లే అంటూ రాసిన ఓ బుక్‌ను పోస్ట్ చేసేసింది సమంత. అయితే పూర్తిగా స్క్రీన్ ప్లేను చూసిన సమంత దాని ప్రేమ పెంచేసుకున్నట్టు కనిపిస్తోంది. ఓ లవ్ సింబల్‌ను కూడా షేర్ చేసింది.

ఆచితూచి..
సమంత ఇప్పుడు ఆచితూచి ప్రాజెక్ట్‌లను ఎంచుకుంటోంది. అందుకే ఒక్కో భాషలో ఒక్కో చిత్రమన్నట్టుగా కొనసాగుతోంది. తమిళంలో కాథవాక్కుల్ రెండు కాదల్, తెలుగులో శాకుంతలం ఇలా రెండే ప్రాజెక్ట్‌లను కన్ఫామ్ చేసింది. ఇక ఫ్యామిలీ మెన్ 2 సీజన్ రిలీజ్ కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











