సమంత ప్రశ్నలకు హీరో ఉక్కిరిబిక్కిరి
చెన్నై: సమంతకు ఓ విషయం నచ్చిందంటే దాని గురించి పూర్తి ఎంక్వైరీ చేయకుండా వదలదట. అలాంటిది ఆమెకు విక్రమ్ నటన టీజర్స్ లో చూసి షాక్ అయ్యిందిట. దాంతో ఆమె విక్రమ్ ని అసలు మీరు ఎలా ఆ గెటప్స్ చేసారు. ఎలా మేకప్ చేసారు అని సతాయిస్తోందిట. విక్రమ్ కొన్ని చెప్పలేక...కొన్ని పూర్తిగా అర్దమయ్యేటట్లు చెప్పలేక సతమతమవుతున్నాడుట. అంతేగాక షాట్ గ్యాప్ వచ్చిందంటే సమంత అడుగుతోందని, దర్శకుడు...కాసేపు ఆ ప్రశ్నల వర్షం ఆపుతారా అంటన్నాడని తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇందంతా ఛాయగ్రాహకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విక్రం, సమంత, పశుపతి ముఖ్య తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం 'పత్తు ఎణ్రదుకుళ్ల' షూటింగ్ లో జరుగుతోంది. షూటింగ్ లో పాల్గొన్న సమంత... 'ఐ'లో విక్రం వివిధ ఆహార్యాల్లో కనిపించడం, నటించిన తీరుపై వివరాలు అడిగేస్తోందట. ఇంతకీ విషయమేమిటంటే.... తను కూడా అలా వేర్వేరు పాత్రల్లో నటించాలని ఆశ పడుతోందట. ఆ సందర్భాలు త్వరగా రావాలని కోరుకుంటోందట. ఈ విషయం పక్కనబెడితే 'పత్తు ఎణ్రదుకుళ్ల' చిత్రం సమంత సినీ ప్రస్థానంలో ఓ మైలురాయిగా నిలుస్తుందని విజయ్ మిల్టన్ భరోసా ఇస్తున్నారు.

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే... ఆమె తెలుగు,తమిళ భాషల్లో బిజీగా ఉంది. అయితే బాలీవుడ్ కి వెళ్లాలని ఆమె అబిమానులు కోరుకుంటున్నారు.
దక్షిణాదిన కొన్ని విజయాలు చేతికి అందగానే ఇక అందరి దృష్టి బాలీవుడ్‌పై పడుతుంది. అక్కడ కూడా నిరూపించుకోవాలన్న తపన మొదలవుతుంది. అయితే సమంతకు అలాంటి ఆలోచనలేం లేదని స్పష్టం చేస్తోంది.
ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...''నా దగ్గర కూడా కోరికల జాబితా చాలానే ఉంది. మంచి సినిమాలు చేయాలి, మరింత పేరు తెచ్చుకోవాలని ఉంది. అయితే ఈ జాబితాలో హిందీ సినిమా చేయాలన్న కోరిక లేదు..'' అంటోంది సమంత.
అయినా ''హిందీలో నటిస్తేనే హీరోయిన్ గా గుర్తింపు వస్తుందా? దక్షిణాదిన చేతినిండా సినిమాలున్నాయి. నా సత్తా బయటపడిందిక్కడే. నాకంటూ ఓ అభిమాన వర్గం ఉంది. నా కోసం పాత్రలు సిద్ధం చేస్తున్న దర్శకులున్నారు. ఇవన్నీ వదులుకొని, మరో చోట అడుగుపెట్టి నా ఉనికిని చాటుకోవాలా? అంత అవసరం లేదనిపిస్తోంది. అందుకే బాలీవుడ్‌కి వెళ్లాలన్న ప్రయత్నాలేం చేయలేదు. చూద్దాం.. అలాంటి అవకాశం వస్తే, చేయాలనిపిస్తే.. అప్పుడు ఆలోచిస్తా'' అని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











