పాపం...సమంత ప్రేమ ఫెయిల్యూర్ అయిందలా
చదువుకునే సమయంలో ఒకబ్బాయి మీద మనసు పారేసుకున్నాను. కొద్ది రోజులు అలా గడిచాయి. కానీ అప్పటి నా అమాయకత్వం, ఏమీ తెలియనితనంతో ఆ ప్రేమను నిలబెట్టుకోలేకపోయాను అంటోంది సమంత. ఏ మాయ చేసావె చిత్రంతో పరిచయమై అందరి మనసులను ఒకేసారి దోచేసిన ఈ ముద్దు గుమ్మ తన గతాన్ని గుర్తు చేసుకుని ఆ ప్రేమ కథలను ఏకరవు పెడుతోంది. ఆమెని నిజ జీవితంలో ప్రేమ గురించి చెప్పండి అంటే ఇలా చెప్పింది.అలాగే..ఆ ప్రేమ విఫలమయ్యాక ఇక అప్పటినుండి ఇంతవరకు ఎవరి ప్రేమలోనూ నేను పడలేదు. కానీ మనకంటూ మనల్ని ప్రాణంగా ప్రేమించే ఒక మనిషి ఉంటే బాగుంటుంది అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ఏదేమైనా..నాకంటూ పుట్టిన మనిషి ఎక్కడో ఒక చోట ఉండేవుంటాడు. అతగాడు నాకెదురుపడ్డప్పుడు ఖచ్చితంగా నేనూ ప్రేమలో పడితీరతాను. ఎందుకంటే నాకు పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే, ప్రేమ పెళ్ళిళ్ల పైనే గురి ఎక్కువ అంటూ తేల్చేసింది. ప్రస్తుతం సమంత...ఎన్టీఆర్ సరసన బృందావనంలోనూ, మహేష్ సరసన శ్రీను వైట్ల చిత్రంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











