'ఏ మాయ చేసావె' లో కష్టం అనిపించిన సీన్: సమంత
కార్తీక్ నా కోసం గోవా నుంచి వస్తాడు. అప్పుడు నేను పైనుంచి కిందికి దిగుతాను. పెద్ద సీన్ అది. ఎక్కడా కట్ చెప్పకుండా ఏకబిగిన చెప్పాలన్నారు. ప్రామిటింగ్ లేదు. చాలా కష్టపడి ఏకాగ్రతతో చేసిన ఆ సీన్ తలచుకుంటే నేనేనా చేసింది అనిపిస్తుంది అంటోంది సమంత. రీసెంట్ గా ఆమె మీడియాతో మాట్లాడుతూ...నాగచైతన్య తో చేసిన ఏ మాయ చేసావే చిత్రం గురించి గుర్తు చేసుకుంది. ఇక ఈ ఆఫర్ ఎలా వచ్చిందో చెప్తూ..చెన్నై స్టెల్లా మేరీస్ కాలేజీలో బికాం చదివాను. అప్పుడే 'నాయుడు హాల్ షాపింగ్ మాల్ వస్త్రాల కోసం మోడలింగ్ చేశాను. అదే సమయంలో తమిళ సినిమా అవకాశం వచ్చింది. అక్కడ నన్ను చూసి గౌతమ్‌మీనన్ తన సినిమాలో ఆఫర్ ఇచ్చారు. యాదృశ్చికంగా వెళ్ళాను. సెలక్ట్ అయ్యావ్ అనగానే నమ్మలేకపోయా అంది. ప్రస్తుతం సమంత ఎన్టీఆర్ తో బృందావనం లో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే మహేష్, శ్రీను వైట్ల చిత్రం,ప్రభాస్,దశరధ్ చిత్రం కమిటయ్యింది.


Click it and Unblock the Notifications











