»   » అప్పుడు చైతూ నా పక్కన కూర్చొని ఏడ్చేసాడు ‌:సమంత

అప్పుడు చైతూ నా పక్కన కూర్చొని ఏడ్చేసాడు ‌:సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సెలబ్రెటీల జీవితంలో కొన్ని ప్రెవేట్ మూవ్ మెంట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిత్వం ఏమిటనేది వాటితో బయిటపడతాయి. రీసెంట్గా ఓ లైవ్ ఛాట్ లో తన కాబోయే భర్త నాగ చైతన్య..ఎంత సెన్సిటివ్ అనేది ఓ సంఘటనతో తెలియచేసింది సమంత.

అందం, అభినయంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయన్ సమంత. ఆమె త్వరలో నాగచైతన్యను వివాహం చేసుకుని ..అక్కినేని కుటుంబ కోడలు కాబోతోంది. నిన్న సాయంత్రం ఆమె అభిమానులతో ఫేస్‌బుక్‌ లైవ్‌ ఛాట్‌లో పాల్గొని కొన్ని వ్యక్తిగత విషయాలు రివీల్ చేసింది.

లైవ్ ఛాట్ లో భాగంగా ఓ అభిమాని విజయ్ హీరోగా వచ్చిన 'తెరి' చిత్రంలో అందర్నీ ఏడిపించారు? అని ప్రశ్నించారు. దీనికి సమంత వెంటనే నవ్వుతూ సమాధానం ఇచ్చారు. 'ఈ సన్నివేశం చేసే ముందు దర్శకుడు అట్లీ సీన్‌ చెప్పారు. అట్లీ.. థియేటర్లో అందరూ ఏడ్చేలా నా ప్రయత్నం చేస్తానని చెప్పా. అది నిజంగా జరగడం విజయంగా భావిస్తున్నా అంది.

సమంత మాట్లాడుతూ...ఆ చిత్రంలో నేను చనిపోతాను. ఈ సినిమాకు నా స్నేహితులతో కలిసి వెళ్లా. నేను చనిపోయే సన్నివేశం వస్తున్నప్పుడు.. స్క్రీన్‌వైపు చూడకుండా థియేటర్లో చుట్టుపక్కల అందర్నీ చూస్తూ కుర్చొన్నా.

చూస్తే ...నాగ చైతన్య నా పక్కన కూర్చొని ఏడుస్తున్నారు. ఆ సీన్ చేసే ముందు అట్లీతో చాలా మాట్లాడాను. అందర్నీ ఏడిపించాలనుకున్నా.. ఏడిపించా' అని నవ్వుతూ చెప్పారు. సమంత పూర్తి ఛాటింగ్‌ వీడియోను మీరూ చూడండి.

English summary
Samantha opened up how sensitive and also emotional her beloved Naga Chaitanya happens to be. Samantha narrates an incident the moment she watched her Tamil Movie “Theri” with Naga Chaitanya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu