అన్నతో రొమాన్స్ చేస్తూనే ...తమ్ముడిని లైన్లో పెట్టిన సమంత!
హైదరాబాద్: హీరోయిన్ సమంత ఓ వైపు సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'అంజాన్'లో నటిస్తున్న తెలిసిందే. ఓ వైపు అన్నతో రొమాన్స్ చేస్తూనే సూర్య తమ్ముడు కార్తిని లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ బ్యూటీ. లింగు స్వామి దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కబోతున్న తమిళ చిత్రం 'యెన్ని యెజు నాల్' చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట.
ఇటీవల దర్శకుడు లింగు స్వామి ఈ విషయమై సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను తీసుకునే విషయం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. దాదాపుగా ఆమెనే ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక సూర్య-సమంత నటిస్తున్న 'అంజాన్' చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇదే కాకుండా....తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలోనూ సమంత ఎంపికయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి శంకర్ 'ఐ' చిత్రంలోనే విక్రమ్ సరసన సమంతను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ సమయంలో సమంత అనారోగ్యం కారణంగా ఆ ఆఫర్ దక్కించుకోలేక పోయింది. ఆమె స్థానంలో అమీ జాక్సన్‌ను తీసుకున్నారు. తాజాగా విక్రమ్ సరసన సమంత నటించబోయే చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించబోతున్నారు.
సమంత ప్రస్తుతం తెలుగులో అక్కినేని ఫ్యామిలీ మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రంలో నటిస్తోంది. మరో వైపు నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఆటో నగర్ సూర్య చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు దర్శకుడు వివి వినాయక్...బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్‌తో తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా సమంతే హీరోయిన్. 'జులాయి' తర్వాత అల్లు అర్జున్‌తో దర్శకుడు త్రివిక్రమ్ మరో సినిమా ప్లాన్ చేసారు. ఇటీవలే ఈచిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈచిత్రంలో సమంత మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైంది.


Click it and Unblock the Notifications











