అల్లు అర్జున్ తో రొమన్స్ చేయనున్న‘మాయలేడి’
'ఏ మాయ చేసావె" చిత్రంతో మాయ చేసి 'బృందావనం" చిత్రంతో ప్రేక్షకుల్ని పరవశింపజేసిన సమంతా కెరీర్ ఇప్పుడు మాంచి 'దూకుడు" మీద ఉండడం తెలిసిందే. మహేష్ బాబుతో 'దూకుడు", రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ" చేస్తున్న సమంతా తాజాగా అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించే సూపర్ చాన్స్ దక్కించుకుందనే సమాచారం అందుతోంది.
అయితే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే చిత్రమా?లేక, వాసు వర్మ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించే 'లవర్" సినిమానా? అన్నది ఇంకా తెలియాల్సి వుంది. 'బద్రినాధ్ అనంతరం అల్లు అర్జున్ నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి!
samantha allu arjun trivikram srinivas vasu varma సమంతా అల్లు అర్జున్ లవర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వాసు వర్మ


Click it and Unblock the Notifications