వివి వినాయిక్ నెక్ట్స్ చిత్రంలో సమంత ఎంపిక
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రేపు విడుదల అవుతున్న నాయక్ తర్వాత చేయబోయే చిత్రం ఖరారైంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయి శ్రీనివాస్ నటించే తొలి చిత్రాన్ని వినాయక్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ సమంతని ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రం ఫిబ్రవరిలో మొదలవుతుంది. ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. అలాగే సమంత ఇప్పటికే బెల్లంకొండ సురేష్ నిర్మాతగా రూపొందుతున్న నందిని రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఎన్టీఆ్రర్ తో చేయనున్న చిత్రంలోనూ ఆమెనే ఎంపిక చేసారు.
ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందనుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ బెల్లంకొండ సురేష్ ..చిత్రం ప్రకటన చేసారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈ విషయం ఖరారు చేసారు. అలాగే ఎన్టీఆర్ సరసన సమంత నటించనుందంటూ తెలియపరిచారు. దాంతో ఎన్టీఆర్ మరోసారి సమంతకు తన సరసన అవకాసమిచ్చినట్లు అయింది.
వినాయిక్ తాజా చిత్రం విషయానికి వస్తే.. రామ్ చరణ్ హీరోగా యూనివర్సల్ మీడియా సంస్థ 'నాయక్' చిత్రాన్ని నిర్మిస్తోంది. కాజల్, అమలా పాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











