నేను వంట చేసాను... కానీ ఎవ్వరూ చావలేదు: సమంత
Recommended Video

పెళ్లికి ముందు నాగచైతన్య వంట చేస్తున్న ఫొటోలను షేర్ చేసిన సమంత, పెళ్లి తర్వాత గృహిణిగా వంట చేయడం గురించి ఫస్ట్ టైమ్ ఇలా పోస్ట్ చేశారు. అందుకే అంటారు పెళ్లి తర్వాత మార్పులు అవంతట అవే వస్తాయని. ఏమైతేనేం సమంత వంట చేసింది. ఎవరికీ ఏం కాలేదు. అంతా సేఫ్ అట.

ఎవరూ చావలేదోచ్
వివాహానంతరం సమంత తొలిసారి వంటగదిలోకి వెళ్లి వంట చేసి గృహిణి బాధ్యతలు నెరవేర్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా 'వంట చేశానోచ్...ఎవరూ చావలేదోచ్' అంటూ సంబరపడిపోయింది.

షూటింగ్ క్యాన్సిల్ కావడంతో
షూటింగ్ క్యాన్సిల్ కావడంతో వంటగదిలోకి వెళ్లానని, కూరగాయలు కత్తిరించడం దగ్గర్నుంచి వంట చేయడం వరకు అన్ని పనులు తానే చేశానని సమంత తెలిపింది. ఇకపై ఖాళీ దొరికితే వంటలు చేయడం నేర్చుకుంటానని చెప్పింది. వివాహానంతరం బంధువుల కుటుంబాల్లో భోజనాల సందర్భంగా ఆ గృహిణు బాధ్యతలు చూసి ఆశ్చర్యపోయానని సమంత తెలిపిన సంగతి తెలిసిందే.

నాగచైతన్య వంట
పెళ్ళికి ముందు నాగచైతన్య వంట చేయడాన్ని చూస్తూ, ఆ వంటకాల్ని టేస్ట్ చేస్తూ మురిసిపోయేది. పెళ్లయ్యాక మాత్రం ఆమె వంట నేర్చుకోవాలని నిర్ణయించుకొందేమో. వంటింట్లోకి వెళ్లి గరిట తిప్పబోతోందట. నాగచైతన్య, సమంత లు పెళ్లి చేసుకున్న తర్వాత విందు భోజనాల కోసం బంధువులు ఆహ్వానిస్తున్నారట.

ఆమె కూడా వంట నేర్చుకోవాలని
అలా వెళ్లినప్పుడు ఆ ఇళ్లల్లో మహిళలు ఎంత బాధ్యతగా ఉంటున్నారో అర్థమైందట సమంతకి. అందుకే ఆమె కూడా వంట నేర్చుకోవాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం సమంత ఓ పక్క ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు సినిమాలు షెడ్యూల్ చూసుకుంటుంది.


Click it and Unblock the Notifications











