»   » సెక్సీ లుక్‌లో కనిపించడంపై సమంత కామెంట్స్ ఇలా..!

సెక్సీ లుక్‌లో కనిపించడంపై సమంత కామెంట్స్ ఇలా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్లు ఏవిషయంలో అయినా పడతారో? లేదో? తెలియదు కానీ.....అందంగా ఉన్నారు, పలానా డ్రెస్ లో మీరు మరింత సెక్సీగా కనిపిస్తున్నారు అంటే మాత్రం తెగ సంబర పడిపోతారు. సౌతిండియా స్టార్ హీరోయిన్ సమంత కూడా అంతే. సమంత ఏ కార్యక్రమానికి హాజరైన తన డ్రెస్సింగుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. అందరిలో ప్రత్యేకంగా, ఇతర హీరోయిన్లకంటే మరింత సెక్సీగా కనిపించేందుకు ఆసక్తి చూపుతుంది. అందరి చూపు తన వైపుకు తిప్పుకునేందుకు ఆసక్తి చూపుతుంది.

ఇటీవల చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత హాట్ లుక్ తో దర్శనమిచ్చింది. అందరి చూపు ఆమె వైపే. ఆమె వేసుకున్న డ్రెస్ అదరిపోయింది. ఇదే విషయాన్ని ఆమెతో అంటే అందుకు బదులిస్తూ డ్రస్ విషయంలో బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాది చిత్రపరిశ్రమలో అభిరుచి తక్కువేనన్నారు.

 Samantha Ruth Prabhu dressing sense

నేను కాస్ట్యూమ్స్ విషయంలో అధిక శ్రద్ధ చూపుతాను. ఏదయినా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు రకరకాల దుస్తులు ధరిస్తానని అన్నారు. తాను వేసుకున్న డ్రెస్ ఇతరులను ఆకర్షిస్తున్నప్పుడు తనకూ సంతోషంగా ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు. ఈ విషయంలో సౌతిండియాలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోందని తెలిపారు.

సమంత తాజా సినిమాల విషయానికొస్తే...ఆమె నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ఆమె విక్రమ్ సరసన నటించిన తమిళ మూవీ '10 ఎన్రాదుకుల్ల' చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    Read more about: samantha, సమంత
    English summary
    Actress Samantha Ruth Prabhu, who is also a popular fashion icon down South, has slammed the reports that she and her stylists are copying the styles of Bollywood actresses Sonam Kapoor and Deepika Padukone.
    Please Wait while comments are loading...