నా రోగనిరోధక శక్తి తగ్గింది అందుకే...:సమంత

By Srikanya

గత కొన్ని రోజులుగా నేను ట్విట్టర్‌లో యాక్టివ్‌గా లేకపోవడం, ఎక్కడా కనిపించకపోవడంతో రకరకాల రూమర్స్ ,వార్తలు వస్తున్నాయి. నా రోగనిరోధక శక్తి తగ్గింది. దీనివల్ల తరచూ ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నాను. అయితే కొన్ని రోజుల క్రితం కన్నా ఇప్పుడు నా పరిస్థితి చాలా చాలా మెరుగ్గా ఉంది. త్వరలో షూటింగ్స్‌కి హాజరవుతా అంటూ క్లారిఫై చేసింది సమంత.

అలాంటిది దాదాపు 25 రోజులుగా సమంత ట్విట్టర్ లో అప్ డేట్స్ చేయటం లేదు. షూటింగ్ లు హాజరు కావటం లేదు. దానికి తోడు మణిరత్నం 'కడల్' సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తనే ప్రకటించారు. ఇటీవల శంకర్ సినిమా నుంచి కూడా తప్పుకున్నారు. దాంతో ఆమెపై రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఆమె ఇలా ట్వీట్ చేసారు.

అంతేగాక ఆమె 'స్కిన్ అలర్జీ'తో బాధపడుతున్నారని కూడా రూమర్ ప్రారంభం అయ్యింది. చివరికి 'ఈగ' విడుదల అయ్యాక సమంత ట్విట్టర్ లో ట్వీట్స్ తో తెరమీదకు వచ్చింది. ఆమె ఈగ గురించి రాస్తూ..మీ అందరూ నన్ను మిస్ అయ్యారని నాకు తెలుసు. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ అందరి ట్వీట్స్ నేను చదువుతున్నాను. రాజమౌళి సార్‌కి, ఆయన కుటుంబ సభ్యులకు థ్యాంక్స్ అంది.

అలాగే 'ఈగ' చిత్రం విజయం సాధిస్తుందని మాకు మొదట్నుంచీ నమ్మకం ఉంది. ఈ చిత్రంలో ఒక భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నాని, సుదీప్ లేకుండా ఈ సినిమాని ఊహించలేకపోతున్నా. సుదీప్ గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. తన నటన అద్భుతం అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్‌ సూర్య' ' రామ్‌ చరణ్‌ ' ఎవడు' మణిరత్నం ' కాదల్‌' గౌతమ్‌ మీనన్‌ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X