Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంబురాల్లో సమంత.. అందమైన గిఫ్ట్‌తో షాకిచ్చిన చైతన్య.. హమ్మయ్య నెల గడిచింది..
దాంపత్య జీవితంలో అక్కినేని నాగార్జున, సమంత ఓ నెలపాటు ఆనందంగా గడిపేశారు. విందు, వినోదాలు, రిసెప్షన్ పార్టీలతో వారి జీవితం కులాసాగా గడిచిపోయింది.
దాంపత్య జీవితంలో అక్కినేని నాగ చైతన్య, సమంత ఓ నెలపాటు ఆనందంగా గడిపేశారు. విందు, వినోదాలు, రిసెప్షన్ పార్టీలతో వారి జీవితం కులాసాగా గడిచిపోయింది. అంతేకాకుండా లండన్‌లో ఓ షార్ట్ ట్రిప్‌గా హానీమూన్‌ను పూర్తి చేసుకొన్నారు. అక్టోబర్ 6, 7 తేదీలలో గోవాలో హిందూ, క్రిస్టియన్ మత సంప్రదాయాల ప్రకారం జరిగిందే. తమ దాంపత్య జీవితంలో నెల రోజులు పూర్తయిన సందర్బంగా సమంతకు నాగచైతన్య ప్రేమగా ఓ గిఫ్టును ఇచ్చి షాకిచ్చారు.
చైతూ, సమంతల మధ్య ప్రేమ చిగురించింది అలా
నాగచైతన్య, సమంతది అందమైన ప్రేమకథ. తొలిసారి 2009లో ఏం మాయ చేశావే చిత్ర షూటింగ్లో తొలిసారి కలుసుకొన్నారు. అప్పటి నుంచి కొన్నాళ్లపాటు వారిద్దరూ మంచి స్నేహాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 2014 నుంచి డేటింగ్ చేయడం ప్రారంభించారు.
అక్కినేని పెళ్లి సందడి
చైతూ, సమంత తమ మధ్య ఉన్న ప్రేమను వారి కుటుంబ సభ్యులకు వెల్లడించడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో వారి వివాహానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. చైతూ, సమంత పెళ్లిని అక్టోబర్‌లో ప్రైవేట్ కార్యక్రమంగా దగ్గుబాటి, అక్కినేని కుటుంబం నిర్వహించింది.
సమంతకు చైతూ అందమైన గిఫ్ట్
వివాహం చేసుకొని నెల రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సమంతకు అందమైన ఫ్లవర్ బోకేను అందజేశాడు. అరుదైన పూలతో చేసిన పుష్ఫగుచ్చాన్ని అందించి తన ప్రేమను మరోసారి వ్యక్తం చేశాడు.
పాస్తా వడ్డించిన చైతూ
అంతేకాకుండా తన ఇష్ణసఖి కోసం మంచి ఫుడ్‌ను స్వయంగా తయారు చేసి వడ్డించారు. సమంత కోసం వేడివేడిగా పాస్తా చేశాడు. అంతేకాదు నా ప్రియమైన భర్త చాలా హాట్‌గా కనిపించాడు. జీవితం చాలా మధురంగా గడిచిపోతున్నది అని సమంత ఓ ఫొటోను ట్వీట్ చేసింది.
గొప్ప వ్యక్తిని పెళ్లాడాను..
ఫ్లవర్ బోకే మీద జీవితమనే పూలబాట మీద నడుస్తున్నాం. మా వివాహానికి ఒక నెల పూర్తయింది. నేను ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిని పెళ్లాడాను అని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను ట్వీట్ చేసింది.