వావ్ బ్యూటిఫుల్: సమంత, నాగ చైతన్య వెడ్డింగ్ వీడియో....

By Bojja Kumar

నాగ చైతన్య, సమంత లవ్ స్టోరీ అంటే అభిమానులకు ఇప్పటికీ ఆసక్తే. 'ఏ మాయ చేశావే' సినిమా సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారడం, ఎవరికీ అనుమానం రాకుండా సాగించిన ప్రేమ వ్యవహారం, 2014 నుండి డేటింగులో ఉండటం.... ఇలా ఇద్దరి జీవితంలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 6న చైతు-సామ్ వెడ్డింగ్ గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం, అక్టోబర్ 7న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది.

Samantha Ruth Prabhu and Naga Chaitanya’s wedding video

తాజాగా సమంత తమ వెడ్డింగ్ మెమొరీస్‌కు సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కొన్ని క్షణాల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది సమంత నటించిన రంగస్థలం, మహానటి, అభిమన్యుడు చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం తమిళంలో సీమరాజా, సూపర్ డిలక్స్ చిత్రాలతో పాటు తెలుగులో యూ టర్న్ అనే చిత్రంలో నటిస్తోంది. నాగ చైతన్య సవ్యసాచి, శైలజా రెడ్డి అల్లుడు చిత్రాల్లో నటిస్తున్నాడు. త్వరలో సమంత, చైతు కలిసి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X