సమంతకు షాకిచ్చిన కుర్రాడు: ఆమె కొత్త ఫ్రెండ్ వివరాలు లీక్.. ఆ పని చేయాలంటూ బెదిరింపులు

చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే నటన, ఆకట్టుకునే హావభావాలతో సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది సమంత రూత్ ప్రభు. ఈ మధ్య కాలంలో అదిరిపోయే పాత్రలతో మెప్పిస్తోన్న ఈ భామ.. దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సమంత 'శాకుంతలం' అనే సినిమాతో రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఆమె లైవ్ చాట్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ ఈ స్టార్ హీరోయిన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా:సమంత రూత్ ప్రభు 'ఏమాయ చేశావే' అనే సినిమాతో వచ్చి.. ప్రేక్షకులు అందరినీ ఫిదా చేసేసింది. అంతేకాదు, ఆరంభంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్‌గా ఎదిగిపోయింది. అలా దశాబ్ద కాలంగా ఆమె ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం సమంత పంథాను మార్చుకుని తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలు, సిరీస్‌లలోనే నటిస్తోంది.

Samantha Ruth Prabhu Opens about Her New Best Friend

శాకుంతలం అంటూ వస్తోంది:గత ఏడాది 'యశోద'గా వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సమంత రూత్ ప్రభు.. ఇప్పుడు గుణశేఖర్‌ తెరకెక్కించిన 'శాకుంతలం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మించాయి. దిల్ రాజు ఈ మూవీకి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. దీనికి మణి శర్మ సంగీతం ఇచ్చారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు నటించారు.

రిలీజ్‌కు రెడీ.. ప్రమోషన్స్‌తో:సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో రూపొందిన 'శాకుంతలం' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందించారు. దీన్ని ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా సమంత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో ఈవెంట్లలో భాగమైంది.

Samantha Ruth Prabhu Opens about Her New Best Friend

అక్కడ మాత్రం యాక్టివ్‌గానే:చేతి నిండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ.. స్టార్ హీరోయిన్ సమంత మాత్రం సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. ఇలా ఎంతో కాలంగా తనదైన రీతిలో నెటిజన్లను అలరిస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

ట్విట్టర్‌లో చాట్.. పర్సనల్స్:సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్‌ను చక్కగా వాడుకుంటోన్న సమంత రూత్ ప్రభు.. 'శాకుంతలం' మూవీ విడుదల సందర్భంగా తన అభిమానులతో ట్విట్టర్ ఖాతా ద్వారా ముచ్చటించింది. ఇందులో వాళ్లు ఆమెను ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు. అందులో పర్సనల్ విషయాలను కూడా ప్రస్తావించారు. వాటన్నింటికీ సమంత చాలా హుందాగా బదులిచ్చింది.

కొత్త ఫ్రెండ్ ఎవరో చెప్పింది:సమంత రూత్ ప్రభు తాజాగా ట్విట్టర్‌లో నిర్వహించిన AskSam సెషన్‌లో ఓ నెటిజన్ 'మీరు టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తున్న లుక్స్ చాలా బాగున్నాయి. మరికొంత కాలం మీరు ఇలా ముద్దుగా కనిపించడానికి ప్రయత్నిస్తారా' అని ప్రశ్నించాడు. దీనికి సమంత 'గ్లాసెస్ (కళ్లజోడు) నా కొత్త బెస్ట్ ఫ్రెండ్' అని చెప్పింది. అంటే వాటి వల్లనే ఈ లుక్ వచ్చిందని పరోక్షంగా వెల్లడించింది.

రిప్లై ఇవ్వకపోతే అని వార్నింగ్:ఇదే సెషన్‌లో మరో నెటిజన్ సమంతతో 'ఓ బేబీ సినిమా సమయంలో సామ్ మీరు నాకు రిప్లై ఇచ్చారు. అప్పుడు ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఒక రిప్లై ఇవ్వండి.. శాకుంతలం బ్లాక్ బస్టర్ అవుతుంది' అని పరోక్షంగా ఆమెను బెదిరించాడు. దీనికి సమంత 'వామ్మో.. అయితే నీతో జాగ్రత్తగా ఉండాలి' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. దీంతో ఇది బాగా హైలైట్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X