Samantha: ఆస్పత్రిలో సమంత.. తన వ్యాధి గురించి షాకింగ్ గా.. అంగవైకల్యం వచ్చే అవకాశం!
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్ డమ్ ను సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం రెట్టించిన ఉత్సాహంతో కెరీర్ లో దూసుకుపోతోంది సామ్. ప్రస్తుతం సమంత ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, యశోద చిత్రాలు ఉన్నాయి. ఇటీవల విడదలైన యశోద ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల సమంత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది సామ్.

ఈ సారి మంచి హిట్ కోసం..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, బ్యూటిఫుల్ సమంత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో నార్త్ ప్రేక్షకులను కూడా కట్టిపడేసిన సామ్.. తర్వాత కణ్మనీ రాంబో ఖతీజా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. ఈ సారి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది సమంత. ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

సైలెంట్ అయిపోయిన సామ్..
పౌరాణిక నేపథ్యంతో శాకుంతలం సినిమా తెరకెక్కగా.. లేడి ఒరియెంటెడ్ గా యశోద మూవీ రానుంది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియట్ చేసింది. ఇక ఇటీవల రిలీజైన యశోద ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో నిత్యం యమ యాక్టివ్ గా ఉండే సామ్ ఇటీవల సైలెంట్ అయిపోయింది. సమంత అలా సైలెంట్ అయిపోవడానికి పలు రూమర్లు తెగ చక్కర్లు కొట్టాయి.

చేతులతో లవ్ సింబల్..
సమంత చర్మ వ్యాధితో బాధపడుతోందని, గర్భసంచి తొలగించుకుంది, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తుందని ఇలా చాలా రకాలుగా ప్రచారం జరిగింది. అయినా సామ్ మాత్రం స్పందించలేదు. కానీ యశోద ట్రైలర్ కు వచ్చిన స్పందన చూసి ఎట్టకేలకు స్పందించింది బ్యూటిఫుల్ సమంత. దీనికి సంబంధంచిన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో సామ్ ఆస్పత్రిలో బెడ్ పై ఉండి చేతులతో లవ్ సింబల్ వేసి ప్రేక్షకులపై ఉన్న ప్రేమను తెలియజేసింది.

మైయోసిటిస్ వ్యాధితో సామ్..
ఇక ఆ పోస్ట్ లో ముందుగా యశోద సినిమా ట్రైలర్ కు వస్తున్న స్పందనకు థ్యాంక్స్ తెలిపింది సామ్. ''మీ అందరితో నేను షేర్ చేసుకునే ప్రేమ, అనుబంధమే.. జీవితం నాపై విసిరే ప్రతి ఛాలెంజ్ ను ఎదుర్కోవడానికి నాకు శక్తిని ఇస్తోంది. కొన్ని నెలలుగా నేను మైయోసిటిస్ అనే అటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నాను. నిజానికి ఈ వ్యాధి నుంచి కోలుకున్నాకా ఈ విషయం గురుంచి చెబుదామనుకున్నాను.

త్వరలోనే కోలుకుంటానని..
కానీ, ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ఈ పరిస్థితిని నేను యాక్సెప్ట్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను. అయితే నేను పూర్తిగా త్వరలోనే కోలుకుంటానని వైద్యులు నమ్ముతున్నారు. ఫిజికల్ గా ఎమోషనల్ గా నేను చాలా ఎదుర్కొన్నాను. మంచి రోజులు, చెడు రోజులు చాలా చూశాను. ఇక నేను హ్యాండిల్ చేయలేనని భావించే ప్రతి రోజు ఏదో ఒకలా గడిచిపోతుంది. దాని అర్థం ఏంటంటే నేను కోలుకోవడానికి మరో రోజుకు దగ్గరవుతున్నట్లు. ఐ లవ్యూ'' అని చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చింది సమంత.

మైయోసిటీస్ అనేది ప్రాణాంతక వ్యాధి..
అయితే మైయోసిటీస్ అనేది ప్రాణాంతక వ్యాధి. కండరాలలో వాపు రావడం, విపరీతమైన నొప్పి, బలహీనపడటం ఈ వ్యాధి లక్షణాలు. కొద్దిగా నడిచినా, నిలబడ్డా అలసిపోతారు. అలాగే శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. ఫిజికల్ థెరపీ, హీట్ థెరపీ, వ్యాయామంతో నయం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాధితో ఒక్కోసారి అంగవైకల్యం, మరణం కూడా సంభవించ వచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం సామ్ పోస్ట్ వైరల్ గా మారింది.
హ్యష్ ట్యాగ్ తో ట్వీట్స్..
సమంత పోస్ట్ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఆమెకు దేవుడు మరింత బలం ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. అలాగే ఆమె వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని #SamanthaRuthPrabhu హ్యష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ట్విటర్ ట్రెండ్ లోకి సమంత వచ్చేసింది.


Click it and Unblock the Notifications











