Shaakuntalam Twitter Review: గుణశేఖర్ చేసిన అతిపెద్ద మిస్టేక్ అదే.. ఆ పాత్రపై ఊహించని రియాక్షన్
సమంత కథానాయికగా క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా ట్రైలర్ టీజర్స్ తోనే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకుంది. ఇక పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతోంది. ఇక సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా ఒక రోజు ముందుగానే ప్రదర్శింపబడ్డాయి. ఇక సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఇక ట్విట్టర్ లో ఎలాంటి టాక్ వచ్చింది అనే వివరాల్లోకి వెళితే...
శాకుంతలం సినిమాలో కొన్ని సీన్స్ ఊహించని విధంగా ఉన్నాయి అని ముఖ్యంగా సమంత లీడ్ పాత్రలో చాలా అద్భుతంగా నటించినట్లు చెబుతున్నారు. శాకుంతలం పాత్రకు ఆమె కరెక్ట్ గా సెట్ అయ్యే విధంగా నటించింది. విజువల్స్ కూడా అక్కడక్కడా పరవాలేదు అనే విధంగా ఉన్నాయి. ఓవరాల్ గా శాకుంతలం సినిమా ఓకే అని చెప్పవచ్చు అనేలా ఒక నెటిజన్ రియాక్ట్ అయ్యారు.

తక్కువ గ్రేడ్ VFX మనకు వాస్తవికతతో కూడిన కార్టూన్‌ను చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. అలాగే యుద్ధ సన్నివేశాలు స్పూఫ్‌గా అనిపిస్తాయి. ఇక డ్రామా కూడా చాలా వరకు ఫ్లాట్‌గా ఉంటుంది. సంగీతం డీసెంట్‌గా ఉంది. సినిమాకు సెకండ్ హాఫ్ చాలా కీలకమైనది అని మరికొందరు ట్వీట్ చేశారు. ఎక్కువగా గ్రాఫిక్స్ పై అంచనాలు పెట్టుకున్న వారికి సినిమా అంతగా కనెక్ట్ కాకపోవచ్చు అని తెలుస్తోంది.
శాకుంతలం సినిమాను దర్శకుడు భారీ స్థాయిలో తెరపైకి తీసుకు రావడానికి చాలానే కష్టపడ్డాడు అని ఆయన ఇంటర్వ్యూల ద్వారా చాలావరకు అర్ధమవుతుంది. కానీ వెండితెరపై మాత్రం.. అన్ని అంశాలను గమనిస్తే ఆ విషయంలో అంచనాలు అందుకోలేదని నెటిజన్లు అంటున్నారు. గ్రాండ్ కాన్వాస్ ఫిల్మ్ కావడానికి చాలా కష్టపడుతుంది కానీ చాలా తక్కువ.. అంటూ రేటింగ్ ఇస్తున్నారు.
శాకుంతలం ఒక విజువల్ ట్రీట్ అని చెప్పవచ్చు. మొత్తం సాంకేతికంగా మంచి స్క్రీన్‌ప్లేతో అద్భుతమైనది.
డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ కూడా క్లాస్. ఇక సమంత టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్. తన పాత్రతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది
డివైన్ రోల్‌తో అని మరికొందరు వారి వివరణ ఇస్తున్నారు. ఇక ఈ వీక్ సమంత విన్నర్ అని కూడా అంటున్నారు.
శాకుంతలం గుణ శేఖర్ గారు గొప్ప దర్శకుడు. కానీ తక్కువ బడ్జెట్‌లలో 3D, VFX ఎఫెక్ట్‌లపై ఆయన ఫోకస్ చేస్తున్న విధానం వలన కథలు చెప్పే సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి అనిపిస్తోంది. గుణ టీమ్ వర్క్స్ ప్లీజ్..గుణ గారు 3D/vfx కోసం సినిమాలు తీయడం మానేయాల్సిన అవసరం ఉందని తెలియజేయండి.. అంటూ మరికొందరు ఊహించని విధంగా రియాక్ట్ అవుతున్నారు.
మొత్తం శాకుంతలం సినిమా ఒక పురాణ పౌరాణిక నాటకంగా నడపబడింది. స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ సంగీతంతో సాంకేతికంగా చిత్ర యూనిట్ చాలా హార్డ్ వర్క్ చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఎమోషనల్ గా కనెక్ట్ కావడంలో సినిమా అంతగా క్లిక్ కాలేదు. ఇక సినిమా ఎలా ఉన్నా సమంత తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం అయితే చేసింది అని మరికొందరు ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











