‘Samantha Ruth Prabhu ను అలా చూస్తే భయమేసింది.. బాడీని ఆ రకంగానా?‘
సమంత రుత్ ప్రభు గ్లామర్ తారగానే కాకుండా హీరోయిన్ ఓరియెంట్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే కొద్ది నెలల క్రితం మయోసిటీస్ అనే కండరాలకు సంబంధించిన వ్యాధితో యాక్టింగ్‌కు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా ఆ వ్యాధి నుంచి తేరుకొన్న సమంత ప్రస్తుతం మళ్లీ షూటింగులతో బిజీగా మారిపోయింది. అయితే సమంతపై ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్, బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక సమంత తాజా పరిస్థితి, ఆమెపై మనోజ్ బాజ్‌పేయ్ చేసిన వివరాల్లోకి వెళితే..

మమోసిటీస్ వ్యాధితో సమంత
సమంత ఆరోగ్యం విషయానికి వస్తే.. యశోద సినిమా రిలీజ్‌కు ముందు తనకు మయోసిటిస్ అనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించడంతో ఆమె అభిమానులు కంగారుపడ్డారు. ఆమె త్వరగా వ్యాధి నుంచి కోలుకోవాలని కోరుకొన్నారు. ఇటీవల ఆమె వ్యాధి నుంచి కోలుకొని ముంబైలో సిటాడెల్ షూటింగులో పాల్గొంటున్నారు. త్వరలోనే ఖుషి సినిమా షూటింగులో కూడా పాల్గొంటారని తెలిసింది.

ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజీగా
ఇక లాక్‌డౌన్ సమయంలో సమంత ఓటీటీలోకి అడుగుపెట్టారు. రాజ్ అండ్ డీకే రూపొందించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రంలో రాజీ పాత్రలో కనిపించిన ఆమె మనోజ్ బాజ్‌పేయ్‌తో కలిసి నటించారు. అయితే సమంతతో కలిసి నటించిన అనుభవాన్ని, అనుభూతిని ఇటీవల ఓ సినిమా ప్రమోషన్‌లో మనోజ్ పంచుకొన్నారు. ఆమె ప్రశంసల వర్షం కురిపించారు.

మానసికంగానే కాకుండా శారీరకంగా
సమంత రుత్ ప్రభు గురించి మనోజ్ చెబుతూ.. ఆమెతో పనిచేయడం చాలా ఈజీ. తన పాత్ర కోసం చాలా కష్టపడుతుంటారు. కేవలం మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా విపరీతంగా కష్టపడటం చూశాను. ఫ్యామిలీ మ్యాన్2 షూటింగు సమయంలో తన శారీరాన్ని చాలా కష్టపెట్టేవారు. ఆమె తన శరీరాన్ని కష్టపెట్టే విషయం చూసి ఓ దశలో నేను భయపడ్డాను అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు.

యశోద సినిమాతో 40 కోట్లు
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. కలెక్షన్ల పరంగా కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నారు. యశోద సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను ఎస్టాబ్లిష్ చేశారు. యశోద సినిమా ద్వారా ఆమె 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

శాకుంతలం సినిమాతో సిద్దం
సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన చిత్రం శాకుంతలం రిలీజ్‌కు రెడీగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్లపై దిల్ రాజు, నీలిమా గుణ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











