ఎక్కడచూసినా హాట్ సమంతనే (ఫొటో)
హైదరాబాద్: హోమ్లీ లుక్ తో ఉండే సమంత హఠాత్తుగా బికినితో కనిపించేసరికి ఆమె అభిమానుల ఆనందానికి అంతూ పొంతూ లేదు. వారంతా ఆమె బికినీ ఫోటోని ట్విట్టర్, ఫేస్ బుక్ లలో షేర్ చేస్తున్నారు. ఈ బికినీ ఫొటో ట్రెండింగ్ గా మారింది. అయితే సినిమాకు ఎంతవరకూ ఉపయోగపడిందనేది మాత్రం అర్దం కావటం లేదు. ఎందుకంటే ఈ చిత్రం మార్నింగ్ షో కే తమిళ, తెలుగు భాషల్లో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
లింగుస్వామి దర్శకత్వంలో సూర్య, సమంత జంటగా నటించిన 'సికిందర్' ఆగస్టు 15న విడుదల అయ్యింది. అయితే ఈ బికినీ విషయం ప్రక్కన పెడితే చిత్రం పై మాత్రం హై ఎక్సపెక్టేషన్స్ తోనే విడుదల అయ్యింది. తెలుగులో లగడపాటి శ్రీధర్ నిర్మాతగా ఈ చిత్రం విడుదల చేసారు.

సూర్య ఇందులో కృష్ణ, రాజుభాయ్ అని రెండు పాత్రలు చేశారు. ముంబై నేపథ్యంలో కథ జరుగుతుంది. సంతోష్‌శివన్ కెమెరా పనితనం, యువన్ సంగీతం హైలైట్ అయినా కథ,కథనం నీరసంగా ఉండటంతో వర్కవుట్ కాలేదు.
విద్యుత్ జమ్వాల్, మనోజ్‌బాజ్‌పాయ్, వివేక్, బ్రహ్మానందం, సూరి తదితరులు నటించారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా దీనిని నిర్మించాయి. యువన్ శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications











