For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఆటోనగర్‌ సూర్య' పై సమంత కామెంట్స్

  By Srikanya
  |

  హైదరాబాద్: ఆర్ధిక ఇబ్బందులలో చాలా కాలం ఆగిపోయి, మొత్తానికి విడుదల అయి 'ఆటోనగర్‌ సూర్య' ఆశించిన మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో దారుణంగా విఫలమైందనే సంగతి తెలిసిందే. అయితే విడుదల అవటమే చాలా వరకూ విజయంగా చాలా మంది అబిప్రాయపడుతున్నారు. మరికొంతమందైతే అసలు విడుదల కాకుండా ఉంటే మంచి జ్ఢాపకంగా మిగిలేది అనే కామెట్స్ సైతం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన సమంత ఏమంది అనేది చూద్దాం...

  సమంత ట్వీట్ చేస్తూ... 'ఆటోనగర్ సూర్య చిత్రం నేను బృందావనం చిత్రం అనంతరం సైన్ చేసాను. అయితే చిత్రం పూర్తి అయ్యి విడుదల అవటానికి మూడేళ్లు పట్టింది. ఫలితం విషయం ప్రక్కన పెడితే చిత్రం విడుదల అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ', అలాగే...చైతు, దేవకట్టా సినిమాని బయిటకు తీసుకురావటానికి చాలా కష్టపడ్డారు అన్నారామె. ఇక చిత్రంలో ..'పెళే్లి ఎవరినన్నా చేసుకున్నా కూడా పిల్లలు మాత్రం వాడి పోలికే... డైలాగు నాకు చాలా బాగా నచ్చింది... ఈ డైలాగు షూట్ జరుగుతున్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను ', అన్నారామె.

  Samantha's Comment On ANS Result

  ఆటోనగర్‌ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. అతడి పేరు సూర్య (నాగచైతన్య). అందరూ ఆటోనగర్‌ సూర్య అంటారు. అతనికి కార్లు రిపేర్‌ చేయడం వృత్తి అయితే సమాజంలో చెడ్డవాళ్లను సరిచేయడం ప్రవృత్తి. పేదల కడుపుకొట్టాలని చూసేవాడికి ముచ్చెమటలు పట్టిస్తుంటాడు. అలాంటివాడు ఓ సారి నగర మేయర్‌తోనే గొడవకు దిగుతాడు. పెద్దవాళ్లతో మనకెందుకురా అంటే.. 'ఇది నాకు మేయర్‌కు జరుగుతున్న పోరాటం కాదు. అత్మాభిమానానికి ఆత్మవంచనకు జరుగుతున్న పోరాటం అంటాడు'.. 'మనిషి విలువకు జంతు బలానికి జరుగుతున్న పోరాటం'అని చెబుతాడు. అసలు ఈ సూర్య ఎవరు.. అతడలా మారడానికి కారణాలేంటి? అనేదే చిత్ర ప్రధానాంశం.

  దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ... ''సూర్య' పాత్ర ప్రజల్లోంచి పుట్టినది. మనం సృష్టించుకున్న పరిస్థితులు తిరిగి మనల్నే ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి... దానికి సమాధానమేంటనేది సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు నాగచైతన్యను ప్రేమికుడిగా, కళాశాల విద్యార్థిగా చూశారు. ఈ సినిమాలో చైతు పాత్ర భిన్నంగా ఉంటుంది. ఆయన పలికే సంభాషణలు సమాజంలో అచేతనంగా ఉన్న వాళ్లకు చురకలు వేసేలా ఉంటాయి. వీటితోపాటు విజయవంతమైన జోడీ నాగచైతన్య-సమంత మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తాయి''

  నాగచైతన్య మాట్లాడుతూ... ''దేవా కట్టా కథ చెప్పినప్పుడు ఈ సినిమా కచ్చితంగా చేయాలి అనిపించింది. సూర్య పాత్ర నాకు మంచి గుర్తింపును ఇస్తుంది. ప్రేమ, పోరాటం, ఉత్కంఠ.. ఇలా అన్ని అంశాలు కలిపి ఉన్న సినిమా ఇది. వివిధ కారణాల వల్ల ఆలస్యమైనా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఏ మాత్రం నిరాశపరచదు. అన్నింటికీ మించి అనూప్‌ అందించిన సంగీతం పెద్ద ఎసెట్‌. సినిమా ప్రేక్షకుల నోళ్లలో ఇన్నాళ్లు నానింది అంటే అది అనూప్‌ సంగీతం వల్లే''.

  English summary
  Samantha tweeted: "I signed Auto Nagar Surya after Brindvanam, but it took 3 years for it to come out and release. Keep the result aside, the best thing is that this movie has released and I'm happy for it', said Samantha
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X