»   » హీరోయిన్ సమంతకు ఈమె డుప్లికేట్: చూస్తే ఆశ్చర్యపోతారు!

హీరోయిన్ సమంతకు ఈమె డుప్లికేట్: చూస్తే ఆశ్చర్యపోతారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను పోలిన ఓ అమ్మాయి ఇపుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మీరు ఆమెను చూస్తే అచ్చం సమంతగే ఉందని ఆశ్చర్యపోతారు. రియల్ గా సమంతను చూడని వారు ఆమె చూస్తే ఆమే సమంత అని పొరపాటు పడటం ఖాయం.

ఆమె పేరు అషు రెడ్డి... ఆమె ప్రస్తుతం తన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అషు రెడ్డి తెలుగు అమ్మాయే. హీరోయిన్ సమంతను పోలి ఉండటంతో ఆమె కూడా సెలబ్రటీ అయిపోయింది.


అషు రెడ్డి... సమంత సినిమాల్లోని డైలాగులతో డబ్ స్మాష్ వీడియోలు చేసి పోస్టు చేస్తుండటంతో వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో 40 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరి అచ్చం తనలా ఓ అమ్మాయి ఉన్న విషయం తెలిస్తే సమంత ఎలా ఫీలవుతుందో...? భవిష్యత్తులో సినిమా వాళ్లు ఆమెను సమంతకు డూప్ లా ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా? చూద్దాం ఏం జరుగబోతోందో?

    English summary
    A Telugu girl named Ashu Reddy has become a small-scale celeb on social media thanks to her close resemblance with Samantha. This beautiful Reddy girl has already amassed close to 40K followers on instagram.
    Please Wait while comments are loading...
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu