»   » సమంత ఎమోషనల్ మెసేజ్, దేని గురించో తెలుసా?

సమంత ఎమోషనల్ మెసేజ్, దేని గురించో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఏ మాయ చేసావే' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన సమంత తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన ఫిబ్రవరి 26తో 7 సంవత్సరాలు పూర్తయింది.

సమంత తొలిసారిగా వెండితెరపై రొమాన్స్ చేసింది నాగ చైతన్యతోనే. ఇపుడు అతడితోనే 7 అడుగులు వేయబోతోంది. ఈ నేపథ్యంలో సమంత ఎమోషనల్ గా స్పందించింది. తన మనసులోని భావాలను ఓ సందేశం రూపంలో పొందు పరిచి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

సమంత ట్వీట్ ఇదే

కష్టాలు పడి పైకొచ్చిన అందరిలాగే తాను కూడా అనేక కష్టాలు, అభద్రతా భావం, వైఫల్యాలు, తిరస్కారాలు, బాధ, ఆవేదన, విజయం, పేరు, డబ్బు అన్నీ చూసాను. విజయాలు సాధించినంత మాత్రాన సంతోషంగా ఉన్నానని కాదని, సాధారణంగా ఉండటం ఎలాగో తెలుసుకోడానికి తనకు ఏడేళ్లు పట్టిందని చెప్పింది. సినిమా తనకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి తన జీవితంలోకి వచ్చిన వ్యక్తులే అని సమంత చెప్పింది. ఈ మాటలు నాగ చైతన్య గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సమంత ఫుల్ హ్యాపీ

సమంత ఫుల్ హ్యాపీ

సమంత, నాగ చైతన్య నిశ్చితార్థం ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. సమంత పెద్దగా సినిమాలేవీ సైన్ చేయకుండా ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులనే పూర్తి చేసే పనిలో ఉంది.

ఆ జ్యోతిష్కుడు చెప్పింది నమ్మడం లేదు

ఆ జ్యోతిష్కుడు చెప్పింది నమ్మడం లేదు

అఖిల్, శ్రీయ భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ అయింది. అఖిల్ జాతకం వల్లనే అలా అయిందని, నాగ చైతన్య జాతకం ప్రకారం కూడా సమంతతో పెళ్లి జరిగే అవకాశం లేదని టాక్. అయితే సమంతగానీ, నాగ చైతన్యగానీ ఈ జ్యోతిష్యాన్ని నమ్మడం లేదని తెలుస్తోంది.

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

పెళ్లి రద్దు: అఖిల్‌నే తప్పుపడుతున్నారు, చైతు-సమంతకు కొత్త తలనొప్పి!

నూనూగు మీసాల వయసులోనే ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి సిద్ధమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు అక్కినేని చిన్నోడు అఖిల్. చిన్న వయసులో ఎంత వేగంగా పెళ్లి పీటల వైపు అఖిల్ అడుగులు వేసాడో... అంతే వేగంగా పెళ్లి పీటల వరకు వెళ్లకముందే కాబోయే భార్యతో గొడవ పెట్టుకుని పెళ్లి రద్దు చేసుకున్నాడనే వార్తలు అందరినీ షాకయ్యేలా చేసాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
As the Telugu romantic drama Ye Maya Chesav completes 7 years, Samantha took to Twitter and wrote a heartfelt message. Ye Maya Chesave was an important film for both Naga Chaitanya and Samantha. Directed by ace filmmaker Gautham Menon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu