బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్‌కి సమంత ఫ్యాన్స్ సాయం (ఫోటోలు)
హైదరాబాద్ : దిల్‌సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ విక్టిమ్(బాధితురాలు)కి సమంత అభిమానులు రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేసారు. అభిమానులంతా కలిసి స్వచ్ఛందంగా ఈ ఫండ్ కలెక్ట్ చేసారు. బాంబాబు పేలుళ్ల సందర్భంగా తన కాళ్లు కోల్పోయిన ఎంబీఏ విద్యార్థిని రజితకు ఈ మొత్తాన్ని అందజేసారు.
ఈ సందర్భంగా సమంతతో పాటు, ఆమె అభిమానులు రజితను, ఆమె కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. మనో నిబ్భరంతో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడంపై సమంత వారిని అభినందించింది.
సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం పలు చిత్రాల షూటింగులతో బిజీగా గడుపుతోంది. తెలుగులో నాగ చైతన్యతో ఆటోనగర్ సూర్య, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీలో, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో, జూ ఎన్టీఆర్‌తో రామయ్యా వస్తావయ్యా చిత్రాల్లో నటిస్తోంది.
ఫోటోలు

ఏంబీఏ విద్యార్థిని రజితతో సమంత, అభిమానులు

సమంత అభిమానులు

రజిత కుటుంబ సభ్యులతో సమంత


Click it and Unblock the Notifications











