సమంత సేవ, ఇక ప్రభుత్వ గుర్తింపుతో...
హైదరాబాద్: హీరోయిన్ సమంత పిల్లలు, మహిళలకు సేవ చేయాలనే ఒక మంచి ఆలోచనలో 'ప్రత్యూష పౌండేషన్' మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యూష ఫౌండేషన కోసం సమంతతో పాటు డాక్టర్లు మంజుల, శైలేష్, పమేలా ఈ ఆర్గనైజేషన్ నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు. పిల్లలు, మహిళ సాధికారత కోసం ఈ ఆర్గనైజేషన్ పని చేస్తోంది.

తాజాగా ఈ ఫౌండషన్‌కు అధికారికంగా ప్రభుత్వ గుర్తింపు కూడా లభించింది. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించారు. ఇక నుంచి ఈ ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయనుంది సమంత. అందులో భాగంగా 'దూకుడు' సినిమాలోని మహేష్ బాబు కాస్టూమ్స్, గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ వేసిన కాస్టూమ్స్ వేలానికి పెట్టింది. స
విభిన్న మార్గాల్లో వీలైనన్ని ఎక్కువ నిధులు ఈ సంస్థ కోసం సేకరించాలనే ఆలోచనలో ఉంది సమంత. కాగా...ఇప్పటి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కాస్టూమ్స్ వేలం వేస్తామని ప్రకటించిన సమంత డేట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. తాజాగా సంస్థకు ప్రభుత్వ గుర్తింపు లభించిన నేపథ్యంలో త్వరలోనే డేట్ ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











