రంగస్థలంపై దెబ్బ.. కీలక ఫొటోలు సోషల్ మీడియాలో లీక్.. సైబర్ పోలీసులకు ఫిర్యాదు..
Recommended Video

మెగా పవర్‌స్టార్ రాంచరణ్, సెన్సిబుల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి లీక్ వ్యవహారంపై నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏమైందంటే..

రాంచరణ్ లుక్‌కు మంచి స్పందన
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ డిసెంబర్ 9న రిలీజ్ చేశారు. ఊర మాస్ క్యారెక్టర్‌లో కనిపించిన రాంచరణ్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక చెర్రీ ఫస్ట్‌లుక్ పోస్టర్లను అభిమాను బైకులపై ముద్రించుకుని హంగామా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రంలోని సమంత పాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడం వివాదంగా మారింది.

సోషల్ మీడియాలో సమంత ఫొటోలు
రంగస్థలం చిత్రంలో సమంత పాత్ర చాలా కీలకమైంది. సినిమాకు ఆ పాత్ర హైలెట్‌గా నిలుస్తుందట. అలాంటి పాత్రకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. సమంత లుక్ అదిరిపోయింది. ఆది పినిశెట్టి లుక్ కూడా సూపర్ అనిపించింది.

చర్యలు తీసుకోండి.. మైత్రి
సమంత్ర ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయని గుర్తించిన నిర్మాతలు వెంటనే స్పందించారు. వెంటనే అప్రమత్తమైన నిర్మాతల వాటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించినట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు
మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు ఈ మేరకు హైదారబాద్‌లోని సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి అందోళన పోలీసుల ముందు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తిస్తామని, భవిష్యత్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం అని ఈ సందర్భంగా పొలీసులు హామీ ఇచ్చినట్టు సమాచారం.

మార్చి 30న విడుదల
ఇక రంగస్థలం చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. చాలా నత్త నడకన సాగుతున్న ఈ షూటింగ్ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని 2018 మార్చి 30న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం 1980 నాటి పరిస్థితులను ఆధారంగా చేసుకొని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని ఫొటోలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











