మజిలీలో చైతు లిప్‌లాక్ సీన్.. ఆ రూల్ నాక్కూడా వర్తిస్తుంది.. సమంత!
రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. వివాహం తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో వీరిద్దరూ భార్య భర్తలుగానే నటిస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో రూపొందుతోంది. ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మజిలీ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతు గురించి ఆసక్తికర వార్తలు చేసింది.

వివాహం తర్వాత
చైతూతో వివాహం తర్వాత సమంత మరిన్ని విజయాల్ని సొంతం చేసుకుంటోంది. గత ఏడాది రంగస్థలం, మహానటి, అభిమన్యుడు లాంటి విజయాలు సమంత ఖాతాలో పడ్డాయి. సమంత, చైతు జంటగా నటించిన మజిలీ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. మజిలీ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. చైతు, దివ్యాంశ లిప్ లాక్ సన్నివేశాన్ని టీజర్ లో చూపించారు. దీని గురించి స్పందిస్తూ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నటనలో భాగం
ముద్దు, కౌగిలింత లాంటి అంశాలు నటనలో భాగం. చైతు, నేను ముందు మంచి స్నేహితులం. ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. మా మధ్య అద్భుతమైన బంధం ఉంది. కానీ ప్రేక్షకులు ఓ విషయాన్ని గమనించాలి. నటనకు, నిజజీవితానికి మధ్య ఓ గీత ఉంది. ముద్దు పెట్టుకోవడం నటనలో భాగం. ఈ విషయాన్ని అభిమానులకు చెప్పదలుచుకున్నా. ఈ రూల్ చైతూతో పాటు నాకు కూడా వర్తిస్తుంది అని సమంత తెలిపింది.

రంగస్థలంలో
రంగస్థలంలో కూడా చరణ్, సమంత మధ్య వచ్చే ముద్దు సన్నివేశం గురించి సర్వత్రా చర్చ జరిగింది. అది నిజమైన ముద్దు కాదని, దర్శకుడు సుకుమార్ కెమెరా ట్రిక్ ఉపయోగించి అలా చూపించారని పేర్కొంది. దీనిపై అనవసరంగా చర్చిస్తున్నారంటూ కూడా ఆ సమయంలో సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. మజిలీ చిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ కావాలని కలగనే యువకుడిగా, సమంత భర్తగా రెండు షేడ్స్ లో నటించనున్నాడు.

పాజిటివ్ బజ్
టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం, గోపి సుందర్ అందించిన సంగీతానికి మంచి ఆదరణ లభిస్తుండడంతో మజిలీ చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నాగ చైతన్యకు ఇటీవల సరైన విజయం లేదు. సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలు.


Click it and Unblock the Notifications











