సమంత సారీ చెప్పింది...మిగతా వాళ్లు అదీ లేదు

By Srikanya

హైదరాబాద్ : వైజాగ్ తుఫాన్ భాధితుల కోసం నిర్వహించిన "మేము సైతం" గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోగ్రామ్ లో భాగంగా ఏర్పాటు చేసిన శనివారం రాత్రి డైన్ విత్ స్టార్స్ పోగ్రాంకి కాజల్, అనుష్క, తమన్నా వంటి పెద్ద హీరోయిన్స్ సైతం పాల్గొన్నారు... అయితే మెయిన్ ఈవెంట్ కు ఆదివారం హాజరు కాలేదు. సమంత సైతం చెన్నైలో షూటింగ్ లో ఉండిపోయి రాలేకపోయింది. కేవలం రికార్డెడ్ పోగ్రామ్ లో పాల్గొంది. అయితే ఈ విషయమై ఆమె ట్విట్టర్ ముఖంగా సారి చెప్పింది. మిగతా హీరోయిన్స్ త్రిష,నయనతార వంటి వారు అసలు ఈ పోగ్రామ్ నే పట్టించుకున్నట్లు లేరు.

సమంత లక్కీగాళ్‌ అని పేరు తెచ్చుకొన్నప్పటికీ... అప్పుడప్పుడు ఆమెనీ పరాజయాలు పలకరిస్తుంటాయి. ఆ ఫలితాలు తనపైన, తన నటనపైనా అసలేమాత్రం ప్రభావం చూపలేవని చెబుతోందీ చెన్నై సోయగం. అందుకే వెంటనే మళ్లీ విజయాలు సొంతం చేసుకోగలుగుతున్నా అంటోంది.

Samantha said Sorry, but Others Didn’t!!!

అసలు జయాపజయాల్ని మీరెలా తీసుకొంటుంటారు అనడిగితే ''మనం చిత్తశుద్ధితో పని చేస్తున్నంతవరకు ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదనేది నా అభిప్రాయం. తొలిరోజు నుంచి వృత్తి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నా. భయభక్తులతో పనిచేస్తున్నా. నటిగా భవిష్యత్తు గురించీ ఆలోచిస్తున్నా. ఆ ముందు చూపు ఎక్కువగా ఉంది కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నానని నమ్ముతుంటా.

ఎప్పుడైనా మన పనితీరు ముఖ్యం.. ఫలితం కాదు. నా సినిమా సరిగ్గా ఆడక పోయినా సమంత ఏంటనేది ప్రేక్షకులకు తెలుస్తుంది కదా? అలాంటప్పుడు ఎందుకు భయపడాలి! పరాజయాల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిసొస్తాయని నాకు ఇటీవలే అనుభవమైంద''ని సెలవిచ్చింది సమంత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X