»   » సమంతా ఎందుకిలా?? నాగ్ మీద రివేంజ్ కోసమా లేక నిజంగానే...!!

సమంతా ఎందుకిలా?? నాగ్ మీద రివేంజ్ కోసమా లేక నిజంగానే...!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇకొద్ది రోజుల్లో సమంత పేరు పక్కన అక్కినేని ఇంటికోడలు అనే ట్యాగ్ వచ్చేస్తుందనీ... సమంతా నాగ చైతన్య పెళ్ళికి అంతా సిద్ద మైనట్టే ననీ వార్తలు వస్తూంటే. ఎవరూ ఊహించని విధంగా ఇంకో షాక్ ఇచ్చింది స్యామ్. తాను వచ్చే సంవత్సరం కుడా సింగల్ గానే ఉంటానని ఇప్పట్లో తనకు పెళ్ళి ఆలోచనలు లేవని తనను కలిసిన ఒక మీడియా సంస్థ ప్రతినిధితో స్పష్టమైన సంకేతాలు సమంత ఇచ్చినట్లు తెలియటం తో ఒక్క సారి అంతా షాక్ కి లోనయ్యారు.

అసలు సమంతా ఏం చెబుతోందీ... అంటూ ఆశ్చర్య పోయారు. గత కొద్ది రోజులుగా తనకు వస్తున్న ఆఫర్లను తిరస్కరిస్తూ తాను నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ లను కూడ తిరిగి ఇచ్చి వేస్తూ తన పెళ్ళికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సమంత ఇప్పుడు ఈ ట్విస్ట్ ఎందుకు తీసుకుందో అర్ధం కాని ప్రశ్నగా మారింది.

"ఏ మాయ చేశావే" సినిమాతో అదిరిపోయే కెమిస్ట్రీ పండించిన ఈ జంటగా తర్వాత "ఆటోనగర్ సూర్య", 'మనం" లాంటి హిట్ సినిమాలలో నటించి బెస్ట్ పెయిర్ గా మెప్పించారు. తాజాగా చైతూ, సమంత జంటగా "సోగ్గాడే చిన్ని నాయనా"తో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, తన రెండో సినిమాను నాగ చైతన్యతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చైతూకి హీరోయిన్‌గా సమంతను తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చినా ఇప్పుదు ఈ సినిమా కూడా అనుమానమేఅంటున్నారు.

Samantha Says No Marriage Now

మొదట్లో పెళ్ళికి నాగార్జున ఒప్పుకోవటం లేదనీ... నాగ చైతన్య చాలా ప్రయత్నించాడనీ అనుకున్నా చివరికి నాగార్జున కూడా ఒప్పేసుకున్నాడు... త్వరలోనే నా కొడుకులు కోరుకున్న అమ్మాయిలతోనే వారి పెళ్ళిల్లు అన్నటుగా మీడియ ముందే చెప్పేసాడు కూడా.. ఇంతలో ఏం జరిగిందో కానీ సమంతా ఇలా ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేసింది.

ఫిలింనగర్ లో వినపడుతున్న గాసిప్పుల ప్రకారం సమంత చైతూల పెళ్ళికి నాగార్జున పెడుతున్న కండిషన్స్ కు షాక్ అయిన సమంత ఈ పెళ్ళి వాయిదా నిర్ణయం తీసుకునేలా చేసిందా అనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. ఇన్ని వార్తలు హడావిడి చేస్తున్నా నాగచైతన్య మాత్రం ఇప్పటి వరకూ కనీసం స్పందించటం లేదు. తమ ప్రేమ విషయం వారతలకెక్కిన దగ్గర్నుంచి కూడా చైతూ అసలూ ఈ వ్యవహారం తో తనకేం సంబందం లేనట్టే వ్యవహరిస్తున్నాడు.

English summary
"I'll be single next year as well. No marriage for me next year " replied Samantha when a news person asked her about marriage plan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu